అంతర్జాతీయ మొబైల్‌ నంబర్‌తోనూ యూపీఐ చెల్లింపులు: ఐసీఐసీఐ బ్యాంక్‌

భారత్‌లో ఉన్న ప్రవాసులు (ఎన్‌ఆర్‌ఐ), అంతర్జాతీయ మొబైల్‌ నంబర్లతో యూపీఐ సేవలను ఉపయోగించుకునే వీలు కల్పిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ సోమవారం ప్రకటించింది.

Published : 07 May 2024 02:42 IST

దుబాయి: భారత్‌లో ఉన్న ప్రవాసులు (ఎన్‌ఆర్‌ఐ), అంతర్జాతీయ మొబైల్‌ నంబర్లతో యూపీఐ సేవలను ఉపయోగించుకునే వీలు కల్పిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ సోమవారం ప్రకటించింది. ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారులు తమ ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌ఓ బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసిన అంతర్జాతీయ మొబైల్‌ నంబరుతో యూపీఐ చెల్లింపులు చేయొచ్చని పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌ ఐమొబైల్‌ పే ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

ఇప్పటివరకు అమెరికా, యూకే, యూఏఈ, కెనడా, సింగపూర్‌, ఆస్ట్రేలియా, హాంకాంగ్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదీ అరేబియాల్లోని ఎన్‌ఆర్‌ఐలు యూపీఐ సేవలను వాడాలంటే.. భారతీయ మొబైల్‌ నంబరును నమోదు చేయాల్సి ఉండేది. తాజా వెసులుబాటుతో ఈ పది దేశాల్లో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐ వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుందని ఐసీఐసీఐ బ్యాంక్‌ డిజిటల్‌ ఛానెల్స్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్‌ హెడ్‌ సిద్ధార్థ మిశ్రా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా యూపీఐ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది తోడ్పడుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని