కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు

ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తులు అందించే కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు అరుణాచలం వెల్లాయన్‌, నారాయణన్‌ వెల్లాయన్‌ నియమితులయ్యారు.

Published : 07 May 2024 02:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తులు అందించే కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ బోర్డులో ఇద్దరు కొత్త డైరెక్టర్లు అరుణాచలం వెల్లాయన్‌, నారాయణన్‌ వెల్లాయన్‌ నియమితులయ్యారు. వీరు అయిదేళ్ల పాటు బోర్డులో కొనసాగుతారు. అరుణాచలం వెల్లాయన్‌ చెన్నై లయోలా కాలేజీలో బీకామ్‌ చదివారు. తదుపరి యూకేలోని లాంకస్టెర్‌ యూనివర్సిటీ నుంచి ఎంఎస్‌సీ (అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌) పట్టా పుచ్చుకున్నారు. ఈఐడీ ప్యారీ ఇండియా, చోళమండలం ఎంఎస్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తదితర సంస్థల్లో పనిచేశారు. నారాయణన్‌ వెల్లాయన్‌ యూకేలో యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ నుంచి ఎల్‌ఎల్‌బీ (హానర్స్‌) పూర్తి చేశారు. 2010 నుంచి కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.

‘ఎకోజెన్‌’లో వాటా పెంచుకున్న కోరమాండల్‌: ఎకోజెన్‌ అనే క్లైమేట్‌ స్మార్ట్‌- డీప్‌టెక్‌ కంపెనీలో కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ తాజాగా రూ.24 కోట్లు పెట్టుబడి పెట్టింది. తన అనుబంధ సంస్థ అయిన డేర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ ద్వారా ఈ పెట్టుబడి పెట్టడంతో, ఎకోజెన్‌లో కోరమాండల్‌ వాటా 5.54 శాతానికి పెరిగింది. ఎకోజెన్‌ 2022-23లో రూ.274 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. సమీప భవిష్యత్తులో ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా దేశాలకు తన సేవలను విస్తరించే సన్నాహాల్లో ఆ సంస్థ ఉన్నందునే, అదనపు పెట్టుబడి సమకూర్చినట్లు కోరమాండల్‌ సీఎఫ్‌ఓ జయశ్రీ శఠగోపన్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని