ఆఫ్‌లైన్‌లోనూ ఇ-రుపీ

ఇ-రుపీ లేదా సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ(సీబీడీసీ)ని ఆఫ్‌లైన్‌ పద్ధతిలోనూ బదిలీ చేసేలా పనిచేస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు.

Published : 07 May 2024 02:37 IST

ముంబయి: ఇ-రుపీ లేదా సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ(సీబీడీసీ)ని ఆఫ్‌లైన్‌ పద్ధతిలోనూ బదిలీ చేసేలా పనిచేస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. నెట్‌వర్క్‌ అనుసంధానం అవసరం లేకుండా నగదులాగే ఉపయోగించుకునేందుకు ఈ పద్ధతి వీలు కల్పిస్తుందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీడీసీకి ఆఫ్‌లైన్‌, ప్రోగ్రామబులిటీ ఫీచర్లను దాస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రోగ్రామబులిటీ ఫీచర్‌ వల్ల నిర్దిష్ట/లక్షిత అవసరాలకు లావాదేవీలు జరపొచ్చని, పేదలున్న ప్రాంతాలు లేదా ఇంటర్నెట్‌ పరిమితంగా ఉన్న ప్రదేశాల్లో ఆఫ్‌లైన్‌ పద్ధతిలో లావాదేవీలు జరపొచ్చని సోమవారమిక్కడ జరిగిన బీఐఎస్‌ ఇన్నోవేషన్‌ సమిట్‌లో ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని