HDFC Merger: జులై 1 నుంచి HDFC విలీనం

HDFC Merger: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం కానుంది. జులై 1 నుంచి ఈ విలీనం అమల్లోకి రానుంది. విలీన సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌గా కొనసాగుతుంది.

Updated : 27 Jun 2023 16:14 IST

దిల్లీ: ప్రైవేటు రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో (HDFC Bank) మార్టిగేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) విలీనానికి తేదీ ఖరారైంది. జులై 1 నుంచి ఈ విలీనం అమల్లోకి రానుందని హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ తెలిపారు. జూన్‌ 30న ఇరు సంస్థల బోర్డులు సమావేశమై విలీనానికి ఆమోదం తెలపనున్నట్లు పరేఖ్‌ తెలిపారు. అలాగే, హెచ్‌డీఎఫ్‌సీ స్టాక్‌ డీలిస్టింగ్‌ ప్రక్రియ జులై 13 నుంచి ప్రారంభమవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌ ఛైర్మన్‌, సీఈఓ కేకే మిస్త్రీ విలేకరులకు వెల్లడించారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనానికి గతేడాది ఏప్రిల్‌ 4న బీజం పడింది. తర్వాత ఈ విలీనానికి సెబీ, సీసీఐ, ఆర్‌బీఐ సహా ఇతర నియంత్రణ సంస్థలు ఆమోదం తెలిపాయి. కార్పొరేట్‌ చరిత్రలో అతిపెద్ద విలీనం అయిన దీని విలువ 40 బిలియన్‌ డాలర్లు. విలీన అనంతరం ఇరు సంస్థల ఆస్తుల విలువ రూ.18 లక్షల కోట్లకు చేరనుంది. విలీనం అనంతరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీకి 41 శాతం వాటా ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన ప్రతి 25 షేర్లకు గానూ హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌ హోల్డర్లకు 42 షేర్లు చొప్పున లభిస్తాయి. విలీన సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌గా కొనసాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని