OnePlus: వన్‌ప్లస్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌.. ఫస్ట్‌ లుక్‌ ఇదే..!

OnePlus Foldable Phones: చైనీస్‌ టెక్‌ దిగ్గజం వన్‌ ప్లస్‌ తన మొదటి ఫోల్డబుల్‌ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేసింది. త్వరలో ఈ ఫోన్‌ గ్లోబల్‌గా లాంచ్‌ కానుంది.

Published : 03 Oct 2023 19:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రీమియం స్మార్ట్‌ఫోన్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ (OnePlus).. త్వరలో ఓఫోల్డబుల్‌ ఫోన్‌ తీసుకురాబోతోంది. శాంసంగ్‌, మోటోరొలా వంటి కంపెనీలు ఇప్పటికే ఫోల్డబుల్‌ ఫోన్లను తీసుకురాగా.. వీటికి పోటీ ఇచ్చేందుకు వన్‌ప్లస్‌ సిద్ధమైంది. గ్లోబల్‌గా అక్టోబర్‌ 19న మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది.

భారత వృద్ధి 6.3%.. ప్రపంచబ్యాంక్‌ వెల్లడి.. ద్రవ్యోల్బణ అంచనాలు పెంపు

వన్‌ప్లస్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ సైడ్‌ ప్యానెల్‌ మెటల్‌ ఫ్రేమ్‌తో రానుంది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఫోల్డబుల్‌ మొబైల్స్‌ కంటే భిన్నంగా కనిపిస్తోంది. ఏళ్లుగా వన్‌ప్లస్‌ తన ఫోన్లకు ఇస్తున్న అలర్ట్‌ స్లైడర్‌ను ఇందులోనూ ఇస్తోంది. ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌ అయినప్పటికీ.. ఫోన్‌కు సంబంధించి ఇతర వివరాలేవీ బయట పడకుండా కంపెనీ జాగ్రత్త పడింది. ఇందులోని కెమెరా బంప్‌ ఎలా ఉండబోతోందన్న వివరాలు కనిపించకుండా కవర్‌చేశారు. వీడియోను బట్టి టైప్‌-సి పోర్ట్‌తో రానుందనే విషయం మాత్రం తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న లీక్స్‌ ప్రకారం.. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ట్రిపుల్‌ కెమెరా ఇవ్వనున్నట్లు సమాచారం. వెనుక 50+48+32 ఎంపీ కెమెరాలు, ముందు 32 ఎంపీ కెమెరా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని