IPO update: రాశి ఫెరిఫెరల్స్‌ ఐపీఓకు భారీ స్పందన

IPO update: ఈ నెల 7న ప్రారంభమైన మూడు ఐపీఓల సబ్‌స్క్రిప్షన్ గడువు నేటితో ముగిసింది. ఇందులో రాశి పెరిఫెరల్స్‌ ఐపీఓకు భారీ స్పందన లభించింది.

Published : 09 Feb 2024 20:50 IST

IPO News | దిల్లీ: ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ ప్రొడక్ట్‌లను డిస్ట్రిబ్యూట్‌ చేసే రాశి పెరిఫెరెల్స్‌ ఐపీఓకు (Rashi Peripherals IPO) మదుపరుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈనెల 7న సబ్‌స్క్రిప్షన్‌కు వచ్చిన ఈ ఐపీఓ నేటితో ముగిసింది. రూ.600 కోట్ల పరిమాణం కలిగిన ఈ ఐపీఓ 59.71 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. 1,42,37,289 (1.42 కోట్లు) షేర్లు విక్రయానికి ఉంచగా.. 85,01,64,480 (85 కోట్లు) బిడ్లు దాఖలయ్యాయి. సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బయ్యర్ల నుంచి 143.66 రెట్ల స్పందన వచ్చింది. నాన్‌-ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు 52.75 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్‌ 10.44 రెట్లు చొప్పున బిడ్లు అందుకున్నాయి.

  • జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓకు 18.50 రెట్లు స్పందన వచ్చింది. 1,01,16,284 (1 కోటి) షేర్లు అందుబాటులో ఉంచగా.. 18,71,96,580 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీ కోటా 38.75 రెట్లు, ఎన్‌ఐఐ కోటా 25.05 రెట్లు, రిటైల్‌ పోర్షన్‌ 5.46 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.393-411గా నిర్ణయించారు.
  • క్యాపిటల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓ చివరిరోజు పూర్తయ్యేనాటికి 4 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. రూ.523 కోట్లు సమీకరించే ఉద్దేశంతో 81,47,373 షేర్లను అందుబాటులో ఉంచగా.. 3,26,04,288 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీల కోటా 6.64 రెట్లు, ఎన్‌ఐఐలు 4.05 రెట్లు, రిటైల్‌ పోర్షన్‌ 2.49 రెట్లు చొప్పున సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి.
  • ఎంటెరో హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ రూ.1600 కోట్ల విలువైన పబ్లిక్‌ ఇష్యూ తొలిరోజు 10 శాతం సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. రిటైల్‌ పోర్షన్‌ 45 శాతం, నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల విభాగంలో 4 శాతం సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. సబ్‌స్క్రిప్షన్‌ 13తో ముగియనుంది. ఇందుకు ధర శ్రేణిగా రూ.1,195- 1,258 నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.1600 కోట్లు సమీకరించనుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని