Realme sale: రియల్‌మీ వాలంటైన్స్‌ డే సేల్‌.. ఈ ఫోన్లపై డిస్కౌంట్‌

Realme sale: రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్‌ ప్రకటించింది. వాలంటైన్స్‌ డే సేల్‌లో వీటిని విక్రయించనుంది.

Published : 06 Feb 2024 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆఫర్‌లో స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌. వాలంటైన్స్‌ డేను పురస్కరించుకుని రియల్‌మీ (Realme) సంస్థ కొత్త సేల్‌ ప్రకటించింది. ఫిబ్రవరి 6 నుంచి 12 వరకు వాలైంటైన్స్‌ డే సేల్‌ను నిర్వహించనుంది. సేల్‌లో భాగంగా నార్జో సిరీస్‌ ఫోన్లపై డిస్కౌంట్‌ అందించనుంది. అమెజాన్‌, రియల్‌మీ వెబ్‌సైట్లలో ఫోన్లను కొనుగోలు చేయొచ్చు.

సేల్‌లో భాగంగా రియల్‌మీ నార్జో 60ఎక్స్‌ 5జీ (Realme Narzo 60x), నార్జో ఎన్‌ 55, నార్జో ఎన్‌ 53 ఫోన్లపై కంపెనీ డిస్కౌంట్‌ ప్రకటించింది. నార్జో 60 ప్రో 5జీ (Realme Narzo 60 Pro 5G) 8జీబీ + 128జీబీ, 12జీబీ+1 టీబీ వేరియంట్‌పై రూ.2 వేలు డిస్కౌంట్‌ ఇస్తోంది. 12జీబీ+256జీబీ వేరియంట్‌పై రూ.4వేలు డిస్కౌంట్‌ కూపన్‌ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ ధర రూ.21,999 నుంచి ప్రారంభమవుతుంది.

ఇక రియల్‌మీ నార్జో 60 5జీ (Realme Narzo 60 5G) 8జీబీ+128జీబీ మోడల్‌ ధర రూ.17,999 కాగా.. సేల్‌లో భాగంగా రూ.14,999కే అందించనున్నారు. 256జీబీ వేరియంట్‌ రూ.16,999కి దొరుకుతుంది. నార్జో 60ఎక్స్‌ (Realme Narzo 60x 5G) ధర రూ.10,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌పై రూ.2వేలు డిస్కౌంట్‌ ఇస్తోంది. నార్జో ఎన్‌ 55 ( Realme Narzo N55) స్మార్ట్‌ఫోన్‌ను రూ.8,999, నార్జో ఎన్‌ 53 (Realme Narzo N53) ఫోన్‌ ధర రూ.7,499కి విక్రయించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని