Claims Reject: ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌ తిరస్కరణకు కారణాలివే..

ముందస్తు అనారోగ్యాలను వెల్లడించనందుకు 25% ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌ తిరస్కరణకు గురవుతున్నట్లు ఒక నివేదికలో వెల్లడైంది.

Published : 22 Nov 2023 19:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాలసీ కొనుగోలు సమయంలో మధుమేహం, రక్తపోటు వంటి ముందస్తు అనారోగ్య ఇబ్బందులను పాలసీదారుడు వెల్లడించడంలో విఫలమైనందున 25 శాతం ఆరోగ్య బీమా క్లెయింలు తిరస్కరణకు గురవుతున్నాయని ఓ నివేదిక తెలిపింది. పాలసీదారులకు కవరేజ్‌ నిబంధనల గురించి తెలియనప్పుడు, ఔట్‌ పేషెంట్‌ విభాగం (ఓపీడీ) లేదా పాలసీ పరిధిలోకి రాని ఇతర చికిత్సల కోసం క్లెయిమ్‌ చేయడానికి ప్రయత్నించడం వంటి కారణాలతో మరో 25% క్లెయిమ్స్‌ తిరస్కరణకు గురవుతున్నాయని పేర్కొంది. పాలసీదారులు విచారణలకు స్పందించకపోవడం వల్ల 16% క్లెయిమ్స్‌ తిరస్కరణకు గురవుతున్నట్లు పాలసీ బజార్‌ పేర్కొంది. 2023 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య 2 లక్షల ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల డేటాను విశ్లేషిస్తే 30 వేల క్లెయిమ్స్‌ తిరస్కరణకు గురయ్యాయని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని