Reliance: విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజున.. రిలయన్స్‌ ఉద్యోగులకు సెలవు

అయోధ్య రామమందిర(Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవం రోజున రిలయన్స్‌ సంస్థ(Reliance Industries) తన ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. 

Updated : 20 Jan 2024 15:28 IST

ముంబయి: అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. ఈ మహత్కార్యం వేళ.. జనవరి 22(సోమవారం)న సంస్థ ఉద్యోగులకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(Reliance Industries) సెలవు ప్రకటించింది. దేశవ్యాప్తంగా సేవలు అందిస్తోన్న సంస్థ సిబ్బందికి ఈ సెలవు వర్తించనుంది.

ఈ వేడుక దృష్ట్యా దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సగం రోజు మాత్రమే పనిచేయనున్న సంగతి తెలిసిందే. రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకలో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా.. ఆ రోజు మధ్యాహ్నం 2.30 గంటల వరకు కార్యాలయాలు మూసి ఉంటాయని కేంద్రం వెల్లడించింది. అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజు సెలవు ప్రకటించగా.. రాజస్థాన్‌, త్రిపుర, ఛత్తీస్‌గఢ్‌, అస్సాం, ఒడిశా సగం దినం సెలవు ఇచ్చాయి.

ప్రధాని మోదీ(Modi) చేతులమీదుగా వేద పండితులు, అర్చకులు ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తొలుత ప్రధాని మోదీ రాముడి విగ్రహాన్ని దర్శించుకోనున్నారు. ఇదిలాఉండగా.. ఈ వేడుకకు ఆహ్వానం అందిన జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కుటుంబం కూడా ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని