Satya Nadella: గూగుల్‌ విధానాలే.. ప్రత్యర్థుల ఎదుగుదలకు అడ్డు: సత్య నాదెళ్ల

Satya Nadella: సెర్చింజన్‌ వ్యాపారంలో గూగుల్‌ గుత్తాధిపత్యం చలాయిస్తోందని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. అయితే, గూగుల్‌ అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రత్యర్థి సంస్థలు ఎదగడం లేదని ఆరోపించారు.

Updated : 03 Oct 2023 15:09 IST

వాషింగ్టన్‌: సెర్చింజన్‌ మార్కెట్‌లో గూగుల్ ఆధిపత్యం వల్ల ప్రత్యర్థి సంస్థలు ఎదగడం చాలా కష్టంగా మారిందని మైక్రోసాఫ్ట్‌ (Microsoft) సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) ఆరోపించారు. ఈ క్రమంలో గూగుల్‌ (Google) అనుసరిస్తున్న వ్యాపార పద్ధతులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యూఎస్‌లోని ఓ కోర్టులో మాట్లాడుతూ ఆయన (Satya Nadella) సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రభుత్వం, గూగుల్‌ (Google) మధ్య జరుగుతున్న యాంటిట్రస్ట్‌ విచారణలో ఆయన తన వాదన వినిపించారు.

గూగుల్‌ (Google) తన గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం యాపిల్‌ వంటి సంస్థలకు బిలియన్ల డాలర్లు చెల్లించినట్లు అమెరికా న్యాయ విభాగానికి చెందిన న్యాయవాదులు ఈ కేసులో వాదనలు వినిపించారు. ఈ కేసులోనే నాదెళ్ల (Satya Nadella) సైతం తమ సంస్థ వాదనలను కోర్టు ముందుంచారు. గూగుల్‌ (Google)కు పోటీగా మైక్రోసాఫ్ట్‌ బింగ్‌ అనే సెర్చింజన్‌ను తీసుకొచ్చింది. 2009 నుంచి మార్కెట్‌ వాటాను పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే, యాపిల్‌తో గూగుల్‌ (Google) చేసుకున్న ఒప్పందాల వల్ల తమ బింగ్‌ పోటీ పడలేకపోతోందని నాదెళ్ల అన్నారు. గూగుల్‌ (Google) దీన్ని ‘ఆదరణ’గా చెబుతున్నప్పటికీ.. తాము మాత్రం ‘ఆధిపత్యం’గానే భావిస్తామని వ్యాఖ్యానించారు.

మెగా సేల్స్‌కు రెడీనా..? అయితే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..

ప్రపంచంలోని తొలి ప్రముఖ సెర్చ్ ఇంజన్‌గా గూగుల్ (Google) భారీ ఎత్తున డేటా సేకరించిందని అమెరికా ప్రభుత్వం వాదించింది. అలాగే తొలి కంపెనీగా నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించిందని తెలిపింది. ఇదే ఆ కంపెనీకి వాణిజ్య ప్రకటనలు, వినియోగదారులను అందించే శక్తిమంతమైన సాధనంగా ఉపయోగపడిందని పేర్కొంది. ఈ వాదనకు నాదెళ్ల సైతం మద్దతు పలికారు. కనీస మార్కెట్‌ వాటా లేకుండా గూగుల్‌ (Google) ఆధిపత్యాన్ని కొల్లగొట్టడం అంత సులభం కాదని అన్నారు.

‘డిఫాల్ట్‌’పైనే అంతా ఆధారపడి ఉంటుంది..

ఒక సెర్చింజన్‌ విజయం దాని పంపిణీ పైనే ఆధారపడి ఉంటుందని నాదెళ్ల తెలిపారు. ఈ నేపథ్యంలో యాపిల్‌కు భారీ ఎత్తున చెల్లించడానికి తాము సిద్ధమయ్యాయని వెల్లడించారు. సెర్చింజన్‌ను ‘డిఫాల్ట్‌’ (ఇన్‌బిల్ట్‌)గా ఇవ్వడంపైనే అంతా ఆధారపడి ఉంటుందని వివరించారు. యూజర్లు సులువుగా తమకు నచ్చిన యాప్‌నకు బదిలీ అవుతారని గూగుల్‌ చేస్తున్న వాదనలో నిజం లేదని పేర్కొన్నారు. ‘సఫారీ’ బ్రౌజర్‌లో డిఫాల్ట్‌గా ఉంటే బింగ్‌ రూపురేఖలే మారిపోతాయని తెలిపారు. కానీ, గూగుల్‌ (Google)తో జట్టుకట్టిన యాపిల్‌ ఏటా బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని పొందుతోందన్నారు. ఈ కారణంగానే బింగ్ వెనుకబడిపోయిందన్నారు.

ఈ వ్యాపార నమూనా పునర్‌వ్యవస్థీకరణ కోసం ప్రభుత్వం జోక్యం చేసుకోవడమో లేక భారీ మార్పు వస్తుందనే ఆశతో బింగ్‌పై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్లు నాదెళ్ల (Satya Nadella)తెలిపారు. ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీపై తొలినాళ్లలో కొంత వరకు ఆసక్తి కనిపిస్తున్నప్పటికీ.. గూగుల్‌ ఆధిపత్యాన్ని మార్చడంలో ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. బింగ్‌కు సైతం ఏఐ సాంకేతికతను జోడిస్తూ మైక్రోసాఫ్ట్‌ కొన్ని మార్పులు చేసిన విషయం తెలిసిందే. అది గూగుల్‌ గుత్తాధిపత్యాన్ని తగ్గిస్తుందని ఆశించారు. కానీ, గూగుల్‌ కూడా ఆ దిశగా ఏఐ టూల్స్‌ను ప్రవేశపెట్టడం వేగవంతం చేసింది. దీంతో భవిష్యత్తులో చివరకు ఏఐలోనూ ఇరు కంపెనీల మధ్య ఒక విష వలయం ఏర్పడే అవకాశం ఉందని నాదెళ్ల ఆందోళన వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని