Festival shopping: మెగా సేల్స్‌కు రెడీనా..? అయితే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..

Festival shopping tips: చాలా మంది ఎంతగానో ఎదురుచూస్తున్న పండగ సేల్స్‌ తేదీలు వచ్చేశాయి. మీరూ ఈ సేల్స్‌లో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే, ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..

Updated : 02 Oct 2023 13:13 IST

Amazon - flipkart sales | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సేల్స్‌కు సిద్ధమవుతున్నాయి. తేదీలతో పాటు ఏయే క్రెడిట్‌ కార్డులపై ఆఫర్లు అందించేదీ ఇప్పటికే ప్రకటించాయి. ఇలాంటి సేల్స్‌ సమయాల్లో భారీ క్యాష్‌బ్యాక్‌లు పొందడానికి క్రెడిట్‌ కార్డులు బాగా ఉపయోగపడతాయి. తెలివిగా ఉపయోగించుకుంటే వాటి పూర్తి ప్రయోజనాలను పొందొచ్చు. మరి మీరూ మెగా సేల్స్‌కు రెడీ అవుతున్నారా? అయితే, పాటించాల్సిన కొన్ని టిప్స్‌ను ఇప్పుడు చూద్దాం..

జాబితా రెడీ చేసుకోండి.. 

సేల్స్‌లో పాల్గొనేముందే ఆర్థిక భారం పడకుండా ఎంత మొత్తంతో షాపింగ్‌ చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. బహుమతులు, అలంకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు సహా మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న అన్ని వస్తువుల జాబితాను తయారుచేసుకోండి. ప్రతి విభాగానికి నిర్దిష్ట మొత్తాలను కేటాయించండి. ఇలా బడ్జెట్‌ తయారుచేసుకుంటే నిర్ణయించుకున్న దాని కంటే అధికంగా ఖర్చు చేయకుండా ఉండటానికి సహాయపడుతుంది.

అమెజాన్‌ సేల్‌ తేదీలూ వచ్చేశాయ్‌.. కొన్ని ఫోన్లపై అప్పుడే డీల్స్‌!

సభ్యత్వం తీసుకోండి..

ఇ-కామర్స్ సంస్థలు అందించే ప్రత్యేక సభ్యత్వ పాలసీలను వినియోగించుకోవాలి. అమెజాన్‌ ప్రైమ్‌, ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ వంటి వాటి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవడం వల్ల ఆఫర్లను కాస్త ముందే పొందొచ్చు. కొన్ని వస్తువులు సేల్‌ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే హాట్‌కేకుల్లా అమ్ముడైపోతుంటాయి. అటువంటి వాటిని సొంతం చేసుకోవాలంటే.. ప్రత్యేక సభ్యత్వం తప్పనిసరి. ఫ్రీ ట్రయల్‌ ఆప్షన్‌నూ వినియోగించుకోవచ్చు.

కార్డు ఎంపిక ముఖ్యం

సేల్స్‌ సమయంలో రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లు.. ఇలా ఆఫర్లు అందించే కార్డులను ఎంచుకోండి. పండుగ సీజన్‌ల కోసమే కొన్ని క్రెడిట్ కార్డ్‌లు ప్రత్యేకంగా తీసుకొస్తారు. వీటిలో వార్షిక రుసుము లేకుండా తక్కువ వడ్డీ రేట్లు అందిచే కార్డులు కూడా ఉంటాయి. ఇవి అధిక క్యాష్‌బ్యాక్‌లు, సున్నా వడ్డీ, ఈఎంఐ సదుపాయం వంటి ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఒకవేళ మీ దగ్గర ఆఫర్‌ అందించే క్రెడిట్‌ కార్డు లేకపోతే స్నేహితులు లేదా బంధువుల నుంచి ముందుగానే వివరాలు సేకరించి పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గరే క్రెడిట్‌ కార్డు ఉన్నా కూడా లిమిట్‌ను గుర్తు పెట్టుకోండి. లేదంటే మీరు కొనాలనుకున్న వస్తువును కొనుగోలు చేయలేరు.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్‌ డేస్‌ వచ్చేశాయ్‌.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్‌

సేవ్‌ చేసి పెట్టుకోండి..

సేల్స్‌ సమయంలో కొన్ని డిమాండ్‌ ఉండే వస్తువుల్ని సొంతం చేసుకోవాలంటే బ్యాంకు, కార్డు వివరాలను ముందే ఇ-కామర్స్‌ ఖాతాలో నమోదు చేయండి. అప్పుడే ఏమాత్రం ఆలస్యం లేకుండా అవసరమైన వస్తువును బుక్‌ చేసుకోవచ్చు. అలాగే చిరునామా వంటి వివరాల్ని అప్‌డేట్‌ చేసుకోండి. ఒకవేళ నివాస ప్రాంతం మారినట్లయితే కొత్త అడ్రస్‌తో చిరునామాను మార్చుకోండి.

సోషల్‌ మీడియానూ ఫాలో అవ్వండి..

ఎన్ని ఆఫర్లు ఉన్నా.. వాటిలో ఆకర్షణీయమైన వాటిని గుర్తించడం కొంచెం కష్టం. అందుకే సోషల్‌ మీడియాను ఫాలో అవుతూ ఉండాలి. కొంతమంది ఔత్సాహికులు తాము గుర్తించిన ప్రయోజనకరమైన ఆఫర్లను పోస్ట్‌ చేస్తుంటారు. అది అందరికీ షేర్ చేయడం వల్ల వైరల్‌గా మారి మన వద్దకు చేరొచ్చు. లేదా ఫెస్టివల్‌ సేల్స్‌ వంటి ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్‌లను గమనించడం వల్ల కూడా సమాచారం తెలుస్తుంది.  

1...2.. 3.. గో

ఈ ప్రత్యేక కొనుగోలు సమయాల్లోనే వివిధ తయారీ సంస్థలు తమ నూతన ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. అయితే, అవి పరిమిత సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిని సొంతం చేసుకోవాలంటే.. సేల్‌ ప్రారంభమైన తొలి గంటల్లోనే కొనుగోలు చేయడానికి ప్రయత్నించాలి. సమయం గడుస్తున్న కొద్దీ స్టాక్‌ అయిపోవచ్చు. మళ్లీ అవి సేల్‌కి రావాలంటే చాలా కాలం పట్టొచ్చు. వచ్చినా.. అప్పటికి ఎలాంటి రాయితీ లేకపోతే.. ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది.

అనవసర కొనుగోళ్లు వద్దు

సాధారణంగా ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు ఊరిస్తుంటాయి. అలాంటి సమయంలో మనకు ఆ వస్తువు అవసరం ఉందా? లేదా? అనే విషయాన్ని ఆలోచించరు. తక్కువ ధరకు లభిస్తుంది కదా కొనేస్తుంటారు. అందుకనే ఆఫర్లు ఉన్నాయనే విషయం పక్కన పెట్టి ఆ వస్తువు అవసరం అనుకుంటేనే కొనుగోలుకు సిద్ధం అవ్వండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు