Shri Balaji Valve IPO: శ్రీ బాలాజీ వాల్వ్‌ కాంపొనెంట్స్‌ ఐపీఓ ధరల శ్రేణి రూ.95-100

Shri Balaji Valve IPO: రూ.21.60 కోట్ల సమీకరణ లక్ష్యంతో శ్రీ బాలాజీ వాల్వ్‌ కాంపొనెంట్స్‌ ఐపీఓకి రానుంది. ఈ కంపెనీ షేర్లు బీఎస్‌ఈ-ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో లిస్టవుతాయి.

Published : 22 Dec 2023 18:20 IST

దిల్లీ: స్టీల్‌ ఉత్పత్తుల సంస్థ శ్రీ బాలాజీ వాల్వ్‌ కాంపొనెంట్స్‌ ఐపీఓ (Shri Balaji Valve Components IPO) డిసెంబర్‌ 27న ప్రారంభం కానుంది. 29వ తేదీ వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. ఈ పబ్లిక్‌ ఇష్యూలో పూర్తిగా కొత్త షేర్లను మాత్రమే జారీ చేస్తున్నారు. ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌’ కింద ఎలాంటి షేర్లను విక్రయించడం లేదు. మొత్తం 21.6 లక్షల ఈక్విటీ షేర్లు ఐపీఓలో అందుబాటులో ఉన్నాయి.

ఐపీఓ (Shri Balaji Valve Components IPO) ధరల శ్రేణిని కంపెనీ రూ.95-100గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.21.60 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. బీఎస్‌ఈ- ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో ఈ షేర్లు లిస్టవుతాయి. ఈ ఐపీఓకి రిజిస్ట్రార్‌గా బిగ్‌షేర్‌ సర్వీసెస్‌ .. బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్‌గా హోమ్‌ సెక్యూరిటీస్‌ వ్యవహరిస్తోంది. ఐపీఓ ద్వారా సమకూరిన నిధులను అదనపు ప్లాంట్ల నిర్మాణం, యంత్రాల కొనుగోలు సహా నిర్వహణ మూలధనం, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కంపెనీ వినియోగించనుంది.

విద్యుత్‌, నిర్మాణం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఫార్మా రంగంలోని పలు కంపెనీలకు పనికొచ్చే వివిధ రకాల వాల్వ్‌లు, వాటికి సంబంధించిన పరికరాలను శ్రీ బాలాజీ వాల్వ్‌ కాంపొనెంట్స్‌ అందిస్తుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని