IPO: 20 నుంచి ఉదయ్‌శివకుమార్‌ ఇన్‌ఫ్రా ఐపీఓ

సివిల్‌ నిర్మాణ రంగంలో నిమగ్నమైన ఉదయ్‌శివ్‌కుమార్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ ఐపీఓ 2023, మార్చి 20న ప్రారంభమవుతుంది. ఈ ఐపీఓ వివరాలు ఇక్కడ చూడండి.

Published : 18 Mar 2023 17:44 IST

దిల్లీ: సివిల్‌ నిర్మాణ రంగంలో నిమగ్నమైన ఉదయ్‌శివ్‌కుమార్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ ఐపీఓ 2023, మార్చి 20 (సోమవారం)న ప్రారంభమవుతుంది. రూ.66 కోట్ల విలువైన పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల మార్చి 23 వరకు బిడ్డింగ్‌ కోసం తెరిచి ఉంటుంది. ఐపీఓలో ఒక్కో షేరు ధరను రూ.33-35గా కంపెనీ నిర్ణయించింది. ఐపీఓ షేర్ల కేటాయింపు 2023, మార్చి 28న జరిగే అవకాశం ఉంది. కంపెనీ షేర్లు 'NSE, BSE' రెండింటిలోనూ లిస్ట్‌ అవుతాయి. ఈ లిస్టింగ్‌ తేదీ 2023, ఏప్రిల్‌ 3.

ఉదయ్‌ శివకుమార్‌ ఇన్‌ఫ్రా ఐపీఓ అధికారిక రిజిస్ట్రార్‌గా 'MAS' సర్వీసెస్‌ నియమితమైంది. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా వచ్చే నిధులను సంస్థ వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు ఉపయోగించాలనుకుంటోంది. 2022, డిసెంబర్‌ 31 నాటికి కంపెనీ చేతిలో 46 వర్క్ ఆర్డర్స్‌ ఉన్నాయి. మొత్తం ఆర్డర్‌ బుక్‌ విలువ రూ.1,290.39 కోట్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని