China: చైనాకు ఏఐ చిప్‌లు ఇవ్వొద్దు.. ఎన్విడియాకు అమెరికా ప్రభుత్వ ఆదేశం

China: చైనాకు అడ్వాన్స్‌డ్‌ ఏఐ చిప్‌లను సరఫరా చేయడం వెంటనే నిలిపివేయాలని ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియాను అమెరికా ప్రభుత్వం ఆదేశించింది.

Updated : 25 Oct 2023 14:04 IST

వాషింగ్టన్‌: తమ ముందస్తు అనుమతి లేకుండా చైనాకు అడ్వాన్స్‌డ్‌ కృత్రిమ మేధ ఎలక్ట్రానిక్‌ చిప్‌ (Artificial intelligence Chips) లను సరఫరా చేయడం వెంటనే నిలిపివేయాలని ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియా (Nvidia)ను అమెరికా ప్రభుత్వం ఆదేశించింది. గతంలో దీనికి కొంత గడువు ఇచ్చినప్పటికీ.. దాన్ని వెంటనే అమలు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. చైనా (China)తో పాటు రష్యా, ఇరాన్‌ సహా మొత్తం 40 దేశాలకు ఏఐ చిప్‌ (AI Chips)లను ఎగుమతి చేయొద్దని అమెరికా అక్టోబర్‌ 17న ఎన్విడియాను ఆదేశించింది.

ఈ ప్రభుత్వం ఆంక్షల వల్ల తమ కంపెనీ ఆదాయంపై స్వల్ప కాలంలో పెద్ద ప్రభావమేమీ ఉండబోదని ఎన్విడియా (Nvidia) వెల్లడించింది. 2022 అక్టోబర్‌లోనే ఏఐ చిప్‌ (AI Chips)ల ఎగమతులపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో చైనాకు మాత్రమే ప్రత్యేకమైన ఏ800, హెచ్‌800ను తయారు చేసి విక్రయిస్తోంది. తాజాగా వీటిని కూడా ఎగుమతి చేయడం నిలిపివేయనుంది. వీటితో పాటు జనరేటివ్‌ ఏఐలో ఉపయోగించే ఎల్‌4ఓఎస్‌ సెమీకండక్టర్ల సరఫరాను కూడా ఆపేయాల్సి ఉంటుంది. మరికొన్ని ప్రముఖ చిప్‌ తయారీ సంస్థలు ఏఎండీ, ఇంటెల్‌ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ కంపెనీలకు కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయా.. లేదా.. అనేది ఇంకా తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని