logo

Devineni Uma: కొడాలి నానీ.. తల్లి, చెల్లిని వెళ్లగొట్టిన వారికి ఎందుకు గడ్డి పెట్టలేదు?

‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి చేస్తున్న కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని హేళనగా మాట్లాడటం దారుణమని  తెదేపా సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

Updated : 26 Oct 2023 07:19 IST

ధ్వజమెత్తిన మాజీ మంత్రి దేవినేని

కొండపల్లి, మైలవరం, న్యూస్‌టుడే: ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి చేస్తున్న కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని హేళనగా మాట్లాడటం దారుణమని  తెదేపా సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన బుధవారం కొండపల్లి, మైలవరాల్లో కొనసాగుతున్న దీక్షా శిబిరాలను సందర్శించి మాట్లాడారు. సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లారని కొడాలి గుర్తు చేసుకోవాలన్నారు. జగన్‌ జైలుకెళ్లిన సందర్భంలో ఆయన తల్లి విజయమ్మ పవిత్ర గ్రంథం పట్టుకొని తిరిగితే, చెల్లి షర్మిల పాదయాత్రలు చేశారని కొడాలికి తెలియదా అన్నారు. తల్లి, చెల్లిని వెళ్లగొట్టిన జగన్‌కు గడ్డి పెట్టకుండా, చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం కొడాలి నానికే చెల్లిందన్నారు.


జగన్‌ అసమర్థుడని నాని చెబుతున్నారా?

బుద్దా వెంకన్న

ఈనాడు డిజిటల్‌, అమరావతి : ‘జగన్‌రెడ్డి జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ, షర్మిల ప్రచారం చేశారు. అంటే.. జగన్‌ అసమర్థుడని కొడాలి నాని చెబుతున్నారా? సీఎం పనికిరానివారని తన మనసులో ఉన్న మాటను ఆయన ఇన్నాళ్లకు బయటపెట్టారు’ అని తెదేపా నేత బుద్దా వెంకన్న అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన చేస్తోన్న జగన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిన మరుసటిరోజే ఆంధ్రప్రదేశ్‌కు నిజమైన దీపావళి పండుగని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని