logo

Vijayawada: పెట్టుబడుల పేరుతో రూ.అర కోటి దోచేశారు

రోజుకో కొత్త తరహాగా సైబర్‌ నేరగాళ్లు అమాయకులను దోచేస్తున్నారు. అధిక ఆదాయం వస్తుందని నమ్మించి రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టించి.

Updated : 08 Mar 2024 08:56 IST

విజయవాడ నేరవార్తలు: రోజుకో కొత్త తరహాగా సైబర్‌ నేరగాళ్లు అమాయకులను దోచేస్తున్నారు. అధిక ఆదాయం వస్తుందని నమ్మించి రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టించి.. ఆనక ముఖం చాటేస్తున్నారు. ఇలా ఇద్దరు యువకులు సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కి రూ.50లక్షల వరకు పోగొట్టుకున్న వైనంపై పోలీసులు కేసు నమోదు చేశారు. రి నందిగామ రైతుపేట యువకుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గత డిసెంబరు 23న చరవాణి వాట్సాప్‌కు గుర్తు తెలియని ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి గ్రూప్‌ లింక్‌ వచ్చింది. దాన్ని క్లిక్‌ చేసి ‘జొనాథన్‌ సైమన్‌ స్టాక్‌ ఎలైట్‌ క్లబ్‌ 218’ అనే వాట్సాప్‌ గ్రూప్‌లో చేరారు. గ్రూప్‌ అడ్మిన్‌.. కంపెనీ స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే అధిక ఆదాయం వస్తుందని చెప్పడంతో నమ్మారు. విడతల వారీగా గుర్తు తెలియని బ్యాంకు ఖాతాలకు రూ.38.5లక్షలు పంపించారు. ఆ తర్వాత డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా రాలేదు. మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు.  రి పటమట యువకుడి చరవాణికి గత నెల 22న గుర్తు తెలియని ఓ వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. గూగుల్‌ మ్యాప్స్‌ రివ్యూలు రాస్తే ఆదాయం ఇస్తామని చెప్పడంతో నమ్మారు. అతను చేసిన టాస్క్‌లకు ఒక్కోదానికి రూ.50 వచ్చింది. ఇలా పలుమార్లు రాసి డబ్బులు సంపాదించారు. పలు టెలిగ్రామ్‌ గ్రూపుల్లో పెట్టుబడి పెట్టి రివ్యూలు రాయాలని చెప్పడంతో.. ఆ మాటలు నమ్మారు. విడతల వారీగా పలు రూ.10.53లక్షలు పెట్టుబడులుగా పెట్టారు. అవి తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు