logo

22 మంది అభ్యర్థులు...28 నామపత్రాలు

జిల్లాలోని పార్లమెంట్‌తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం 22 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.

Published : 24 Apr 2024 05:22 IST

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: జిల్లాలోని పార్లమెంట్‌తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం 22 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానానికి ఎన్డీయే కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తరఫున ఆయన కుమారుడు అనుదీప్‌ రెండు సెట్ల నామపత్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీకి అందజేశారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి కూటమి బలపర్చిన తెదేపా అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్‌ దాఖలు చేశారు. తెలుగు రాజాధికార సమితి పార్టీ తరఫున అడోతు తులసీరామ్‌ రెండు సెట్లు, జైభారత్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థ్ధిగా అంబళ్ల రాజకుమార్‌, స్వతంత్ర అభ్యర్థులుగా సింహాద్రి రామచరణ్‌, వల్లభనేని నాగపవన్‌కుమార్‌లు నామినేషన్లు సమర్పించారు. గన్నవరం అసెంబ్లీ స్థానానికి సీపీఐ(ఎం) నుంచి తెల్లాకుల వెంకట లక్ష్మణస్వామి, కల్లం వెంకటేశ్వరరావులు, బహుజన సమాజ్‌ పార్టీ నుంచి సింహాద్రి రాఘవేంద్రరావు, నవరంగ్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి పైలా అజయ్‌, స్వతంత్ర అభ్యర్థులుగా షేక్‌ఛాన్‌బాషా, పి.అరుణకుమారిలు నామపత్రాలు అందజేశారు.పెడనకు పిరమిడ్‌ పార్టీఆఫ్‌ ఇండియా నుంచి సబ్బిశెట్టి రేవతిదేవి, పామర్రుకు రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎ) అభ్యర్థిగా మంగం రాజమనోహర్‌, పెనమలూరుకు తెలుగు రాజాధికారసమితి పార్టీ నుంచి మరీదు శశిధర్‌, అవనిగడ్డకు పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి ముంగర వెంకట నాంచారయ్య, బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా గుంటూరు నాగేశ్వరరావు, స్వతంత్రునిగా నాదెళ్ల గిరిధర్‌నాయుడు నామపత్రాలు దాఖలు చేశారు. మచిలీపట్నం అసెంబ్లీకి వైకాపా అభ్యర్థిగా పేర్ని వాకాసాయికృష్ణమూర్తి(కిట్టూ) మూడు సెట్లు, తెలుగు రాజాధికారసమితి పార్టీ నుంచి ఆదోతు తులసీరామ్‌ రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థులుగా కోటప్రోలు సునీల్‌బాబు, ఈడే భాస్కరరావులు నామినేషన్లు వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని