logo

TS News: నుమాయిష్‌పై 10వ తేదీ వరకే ఆంక్షలు

నగరంలోనూ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులను అనుసరించి నాంపల్లి ఎగ్జిబిషన్‌ను

Updated : 08 Jan 2022 07:01 IST

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, ఆబిడ్స్‌: నగరంలోనూ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులను అనుసరించి నాంపల్లి ఎగ్జిబిషన్‌ను మూసేస్తున్నట్లుగా గురువారం సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం ప్రకటించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎక్కడా నుమాయిష్‌ను పూర్తిగా మూసెయ్యాలని పేర్కొనలేదని, ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే వాయిదా వేయాలని పేర్కొంటూ శుక్రవారం తాజా ఉత్తర్వులు జారీ చేసినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై ఆదిత్య మార్గంను సంప్రదించగా.. 10వ తేదీ నాటికి ఉండే పరిస్థితుల ఆధారంగా కార్యవర్గంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆంక్షలు తొలగితే... 24 గంటల్లో ప్రారంభించనున్నామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని