logo

Samantha: మానసిక సమస్యలు ఎదుర్కొన్నా

మానసిక సమస్యలను అధిగమించే విషయంలో ప్రతి ఒక్కరికీ తగిన అవగాహన అవసరమని సినీ నటి సమంత అన్నారు. రోష్ని ట్రస్ట్‌ ఆధ్వర్యంలో దాట్ల ఫౌండేషన్‌ సహకారంతో...

Updated : 09 Jan 2022 10:47 IST

అమీర్‌పేట, న్యూస్‌టుడే: మానసిక సమస్యలను అధిగమించే విషయంలో ప్రతి ఒక్కరికీ తగిన అవగాహన అవసరమని సినీ నటి సమంత అన్నారు. రోష్ని ట్రస్ట్‌ ఆధ్వర్యంలో దాట్ల ఫౌండేషన్‌ సహకారంతో ‘సైకియాట్రీ ఎట్‌ డోర్‌ స్టెప్‌’ అనే కార్యక్రమాన్ని శనివారం అమీర్‌పేటలోని హోటల్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సమంత మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి ఒక్కరికీ మానసిక సమస్యలుంటాయని, వాటిని ఎదుర్కోగలిగే అవకాశాలను అందిపుచ్చుకోవడం ముఖ్యమని చెప్పారు. ఎందరో చెప్పుకోలేని మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. సమస్యలను తమలో తామే దాచుకోకుండా ఇతరులకు చెప్పుకొంటే పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. తానూ మానసిక సమస్యలను ఎదుర్కొన్నానని.. వాటిని తట్టుకుని బయట పడగలిగానన్నారు. ఇందుకు తన మిత్రులు ఎంతో సహకరించారని గుర్తు చేశారు. ప్రతి మానసిక సమస్యకు వైద్యుల వద్దకే వెళ్లాల్సిన అవసరం లేదని, సరైన కౌన్సెలర్‌ ఉంటే సమస్య తేలిగ్గా సమసిపోతుందని చెప్పారు. ఈ తరహా సమస్యలతో బాధపడుతున్న వారికి మనోధైర్యం కల్పించేందుకు రోష్ని ట్రస్ట్‌ వారు ‘సైకియాట్రి ఎట్‌ డోర్‌ స్టెప్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించడం హర్షించదగిన విషయమన్నారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌, రోష్ని ట్రస్ట్‌ ప్రచారకర్త శిల్పారెడ్డి, దాట్ల ఫౌండేషన్‌, రోష్ని ట్రస్ట్‌ సభ్యులు మహిమ దాట్ల, త్రిషానియా రాజు, డా.శ్రీలక్ష్మి, శశి, రంజన, శశిరెడ్డి, పూనం పమ్నాని పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు