logo

సామాజిక మార్పుల సమాహారమే ఏడు తరాల తలపోత

 జీవితంలో ఒడిదొడుకులు, కష్టసుఖాలు, లద్నూరు పోలీసు క్యాంపు నుంచి సుకుమా జైలు జీవితం వరకు సామాజిక మార్పుల సమాహారమే ఆమె ఏడు తరాల తలపోత ఆత్మకథ అని వక్తలు కొనియాడారు.

Published : 04 Apr 2022 03:27 IST

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సుద్దాల అశోక్‌తేజ, కె.శ్రీనివాస్‌, అల్లం నారాయణ, సరస్వతి, పద్మజ రమణ, సుకుమార్‌, కాత్యాయిని, విమలక్క, గడ్డం లక్ష్మణ్‌

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే:  జీవితంలో ఒడిదొడుకులు, కష్టసుఖాలు, లద్నూరు పోలీసు క్యాంపు నుంచి సుకుమా జైలు జీవితం వరకు సామాజిక మార్పుల సమాహారమే ఆమె ఏడు తరాల తలపోత ఆత్మకథ అని వక్తలు కొనియాడారు. ఆదివారం సుందరయ్య కళానిలయంలో రచయిత్రి బల్ల సరస్వతి ఆత్మకథ పేరిట రూపొందించిన కలెనేత(ఏడు తరాల తలపోత) పుస్తకాన్ని సినీ దర్శకుడు సుకుమార్‌ ఆవిష్కరించి మాట్లాడారు. కలెనేత గొప్ప పుస్తకమన్నారు. అప్పట్లో తాను ఉద్యమంలో ఉంటూ కవితలు రాయడం నేర్చుకున్నాను. ఆ రచనలే పెట్టుబడిగా సినీ రంగంలోకి వచ్చానన్నారు. తెలంగాణ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ గ్రామీణ జీవన చిత్రం పుస్తకంలో చక్కగా ఉందన్నారు. ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆమె చైతన్య దీపిక, సామాజిక ఉద్యమకారిణి అని కొనియాడారు. ప్రొ.గడ్డం లక్ష్మణ్‌ మాట్లాడుతూ నాటి సమాజంలో ఆమె అనుభవించిన అనేక ఆటుపోట్ల కలబోతనే నేటి కలెనేత పుస్తకమన్నారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడారు. ప్రజాగాయని విమలక్క చక్కని గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో పద్మజ రమణ, బల్ల రవీంద్ర, రచయిత్రి చూపు కాత్యాయిని తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని