logo

పొంచి ఉన్న ఇంధన కొరత

నగరంలో గత వారం రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 23న ఏకంగా పదుల సంఖ్యలో బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ బంకుల్లో ఎప్పుడు ‘నో స్టాక్‌’ బోర్డు పెడతారో తెలియని పరిస్థితి.

Published : 27 May 2022 02:34 IST

20 శాతం బంకుల్లో ‘నో స్టాక్‌’ బోర్డులు

హైటెక్‌సిటీలో ఇంధన స్టాకు లేక మూసేసిన ఓ పెట్రోల్‌ బంకు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో గత వారం రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 23న ఏకంగా పదుల సంఖ్యలో బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ బంకుల్లో ఎప్పుడు ‘నో స్టాక్‌’ బోర్డు పెడతారో తెలియని పరిస్థితి. ఆయిల్‌ కంపెనీలు వాస్తవ కోటాకు 25 శాతం కోత విధించడంతో పాటు క్రెడిట్‌ సదుపాయాన్ని రద్దు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పెట్రోల్‌ డీలర్ల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. ఉదాహరణకు.. ఓ డీలర్‌ గతంలో 5 కేఎల్‌ పెట్రోల్‌, 15 కేఎల్‌ డీజిల్‌ కావాలంటే సుమారు రూ.19 లక్షల రుణం కోరితే వెంటనే మంజూరయ్యేది. ఆ రుణాన్ని రాత్రి లోగా చెల్లించేందుకు వీలుండేది. ప్రస్తుతం ఈ విధానం రద్దు చేశారు. ముందు డబ్బు చెల్లిస్తేనే సరఫరా చేస్తున్నారు. డబ్బులు కట్టినా కోటాలో 75 శాతం మాత్రమే ఇస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. ఇప్పటికే నగరంలోని 20 శాతం బంకులపై కొరత ప్రభావం పడింది. ఓవైపు ధరలు పెరుగుతున్నా వినియోగం తగ్గడంలేదు. 35 శాతం పెట్రోల్‌, 25 శాతం డీజిల్‌ వినియోగం పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

గ్రేటర్‌లో....

మొత్తం బంకులు: 500

రోజుకు వినియోగం: 35 లక్షల లీటర్ల పెట్రోల్‌ 40 లక్షల లీటర్ల డీజిల్‌

వాహనాలు: 72 లక్షలు (రోజుకు 1000కి పైగా కొత్తవి రిజిస్టర్‌ అవుతున్నాయి)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని