logo

కొలువు కావాలని రూ.11 లక్షలకు టోకరా

ఉద్యోగం కావాలని నమ్మించి రూ.11 లక్షలు దోచేసిందో సైబర్‌ కి‘లేడి’. బాధితుడు ఆదివారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఎస్సై శాంతారావు తెలిపిన వివరాల ప్రకారం... ఖైరతాబాద్‌కు చెందిన ఓ

Published : 27 Jun 2022 02:43 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఉద్యోగం కావాలని నమ్మించి రూ.11 లక్షలు దోచేసిందో సైబర్‌ కి‘లేడి’. బాధితుడు ఆదివారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఎస్సై శాంతారావు తెలిపిన వివరాల ప్రకారం... ఖైరతాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి జాబ్‌ అసిస్టెన్స్‌ చేస్తుంటారు. ఆయనకు ఐఎంఓ మాధ్యమం ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఉద్యోగం విషయంలో సహాయ సహకారాలు అందించాలని కోరింది. జాబ్‌ సపోర్ట్‌ కోసం డబ్బు పంపించాల్సి ఉండటంతో ఆమె ఖాతాను తన ఖాతాకు యాడ్‌ చేశారు. ఆ తర్వాత మూడు దఫాలుగా బాధితుడి ఖాతాలోంచి రూ.11 లక్షలు మాయమయ్యాయి. ఆ మొత్తం ఆ యువతి ఖాతాకుపోయినట్లుగా గుర్తించారు. బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉద్యోగం పేరిట రూ.2.2 లక్షలు..
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.2.20 లక్షలు దోచేశారంటూ ఓ బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పాతబస్తీ ఘాన్సీబజార్‌కు చెందిన ఓ వ్యక్తికి సామాజిక మాధ్యమం ద్వారా ఒకరు పరిచయమై ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఆ తర్వాత రకరకాల కారణాలతో విడతలవారీగా రూ.2.2 లక్షలు దండుకున్నాడు. బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని