logo

విద్యుత్తు బిల్లులు వసూలు చేసి వడ్డీకి

వినియోగదారుల నుంచి కట్టించుకున్న కరెంట్‌ బిల్లులను సొంతానికి వాడుకున్న ఘటనకు సంబంధించి ముగ్గురు విద్యుత్తు అధికారులపై వేటు పడింది.

Published : 30 Jun 2022 02:28 IST

సూత్రధారి ఏఏవోతోపాటు మరో ఇద్దరి సస్పెన్షన్‌

ఈనాడు, హైదరాబాద్‌: వినియోగదారుల నుంచి కట్టించుకున్న కరెంట్‌ బిల్లులను సొంతానికి వాడుకున్న ఘటనకు సంబంధించి ముగ్గురు విద్యుత్తు అధికారులపై వేటు పడింది. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో కందుకూరు ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసు(ఈఆర్‌వో)లో పుప్పాల శ్రీనివాస్‌ ఏఏవోగా పనిచేస్తున్నారు. వినియోగదారుల నుంచి వసూలైన కరెంట్‌ బిల్లులను డిస్కం ఖాతాలో జమ చేయకుండా బయట అధిక వడ్డీకి రొటేషన్‌ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ చేపట్టగా సొంతానికి వాడుకున్న సొమ్ముకు సంబంధించి సదరు ఏఏవో తన వ్యక్తిగత చెక్కును డిస్కం ఖాతాలో జమ చేసినట్లు తేలింది. అది బౌన్స్‌ కావడంతో తన వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి ఆర్‌టీజీఎస్‌ చేశాడు. రికార్డుల ఆధారంగా ఏఏవో అడ్డంగా దొరికిపోయాడు. దీంతో అతడ్ని రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈ గోపయ్య ఇటీవల సస్పెండ్‌ చేశారు. ఇంత జరుగుతున్నా పై అధికారుల దృష్టికి తీసుకురాకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు అదే కార్యాలయంలోని జేఏవో రాచకొండ బాలరాజు, జూనియర్‌ అసిస్టెంట్‌ ఎ.రమేశ్‌ను సస్పెండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని