logo

గ్రంథాలయానికి చావకుల్ నరసింహమూర్తి పేరు

చింతలబస్తీలోని దక్షిణ భారత హిందీ ప్రచార సభలోని గ్రంథాలయానికి చావకుల్‌ నరసింహమూర్తి

Updated : 04 Jul 2022 13:33 IST

పంజాగుట్ట : చింతలబస్తీలోని దక్షిణ భారత హిందీ ప్రచార సభలోని గ్రంథాలయానికి చావకుల్‌ నరసింహమూర్తి గ్రంథాలయంగా నాయమకరణం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అధ్యక్షులు ఓబయ్య మాట్లాడుతూ చావకుల్ నరసింహమూర్తి చేసిన సేవలు అభినందనీయమన్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గ్రంథాలయానికి ఆయన పేరు పెట్టామని తెలిపారు. హిందీ ప్రచార సభలో ట్రెజరర్‌గా, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా నరసింహమూర్తి ఎనలేని సేవలందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అబ్దుల్ రెహ్మాన్‌, ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ మహ్మద్‌ ఖాసీం, ట్రెజరర్‌ జమీనా, ఆంధ్ర, తెలంగాణ సెక్రటరీ శ్రీధర్‌, ఆయన కుమారుడు చావకుల్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని