logo

ఇళ్ల పంపిణీని వేగవంతం చేయండి

నగరంలోని లక్ష రెండు పడక గదుల ఇళ్ల పంపిణీకి చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పటికే 60 వేల ఇళ్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయని తెలిపారు. పురోగతిలోని నిర్మాణాలను సాధ్యమైనంత

Published : 05 Jul 2022 01:21 IST

మంత్రి కేటీఆర్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలోని లక్ష రెండు పడక గదుల ఇళ్ల పంపిణీకి చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పటికే 60 వేల ఇళ్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయని తెలిపారు. పురోగతిలోని నిర్మాణాలను సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి తేవాలన్నారు. రెండు పడక గదుల ఇళ్ల పంపిణీపై సోమవారం నానక్‌రాంగూడలోని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘‘ఇళ్ల పంపిణీకి అవసరమైన నియమ, నిబంధనలను వారంలోపు సిద్ధం చేయాలి. గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని మార్గదర్శకాలు రూపొందించండి. అందుకోసం సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని ఉపయోగించుకోవాలి. ఇళ్లు అర్హులకే అందాలి. క్షేత్రస్థాయి సర్వే, దరఖాస్తుల పరిశీలన కోసం పెద్ద ఎత్తున బృందాలను ఏర్పాటు చేయండి. వారంలో మరోసారి చర్చిద్దాం. సమావేశం నాటికి సూచించిన మార్గదర్శకాలను రూపొందించి, పురోగతితో అధికారులు హాజరవ్వాలి.’’ అని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ, పురపాలకశాఖ, గృహ నిర్మాణశాఖ, తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని