logo
Published : 06 Aug 2022 02:56 IST

ఆరుగాలం శ్రమ.. రోడ్డుపాలు


చేవెళ్ల మార్కెట్‌లో టమాటాను పారబోస్తున్న రైతులు

చేవెళ్ల, న్యూస్‌టుడే: పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో టమాటాలకు ధర పడిపోయింది. డిమాండ్‌ కంటే రెండింతలు ఎక్కువగా మార్కెట్‌కు వస్తుండటంతో కొనేవారు కరవయ్యారు. శుక్రవారం చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌కు సుమారు 500 బాక్సులకు పైగానే తీసుకురాగా.. అందులో సగమే వ్యాపారులు కొనుగోలు చేశారు. గురువారం కూడా తీసుకొచ్చిన సరకులో సగం అమ్ముడు పోలేదు. దీంతో శుక్రవారం సుమారు వంద బాక్సుల టమాటాలను రైతులు మార్కెట్‌ ఆవరణలో పారబోశారు. చేవెళ్లలో 25 కిలోల బాక్సు రూ.100 పలకగా కిలో రూ.4కు విక్రయించారు. నగరంలో రూ.20కి అమ్ముతున్నారు

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts