logo

అమృతోత్సవాలకు ముస్తాబవుతున్న కార్యాలయాలు

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాలను సీఎం కేసీఆర్‌ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తారు. గ్రేటర్‌ పరిధిలోని ప్రభుత్వ భవనాలు, జంక్షన్‌లను విద్యుద్దీపాలతో అలంకరించారు.

Published : 08 Aug 2022 02:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాలను సీఎం కేసీఆర్‌ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తారు. గ్రేటర్‌ పరిధిలోని ప్రభుత్వ భవనాలు, జంక్షన్‌లను విద్యుద్దీపాలతో అలంకరించారు. వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, దుకాణాలు, రెసిడెన్షియల్‌ కాలనీల్లో స్వతహాగా తమ ఇళ్లను విద్యుద్దీపాలతో అలంకరించాలన్నారు. వ్యాపార, వాణిజ్య అసోసియేషన్‌ ప్రతినిధులు తప్పనిసరిగా దుకాణాలను వెలుగులతో నింపాలని జీహెచ్‌ఎంసీ కోరింది. ఉప కమిషనర్లు తమ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో చారిత్రాత్మక భవనాలకు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, కాలనీలను అలంకరించేలా బాధ్యత వహించాలని కోరింది.

రేపటి నుంచి జెండాలు పంపిణీ చేయండి

ప్రతి ఇంటికీ జాతీయ పతాకాలు పంపిణీ ఈ నెల 9 నుంచి చేపట్టాలని రంగారెడ్డి జిల్లా అధికారులను మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌, కలెక్టర్‌, ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లు, కమిషనర్లతో మంత్రి ఆదివారం వర్చువల్‌గా సమావేశమై మాట్లాడారు. ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, జైపాల్‌ యాదవ్‌, అంజయ్య యాదవ్‌, కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని