logo

Hyderabad News: నాన్నను బతికించుకొనేందుకు ఆస్తులమ్మి.. షేర్లలో పెట్టి ఆత్మహత్య

షేర్‌ మార్కెట్‌లో నష్టం రావడంతో మనస్తాపానికి గురై ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్‌పూర్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లా గోళ్లపాడుకు చెందిన గుడ్ల లక్ష్మీనారాయణ(37)

Updated : 12 Aug 2022 11:10 IST

లక్ష్మీనారాయణ

అమీన్‌పూర్‌, న్యూస్‌టుడే: షేర్‌ మార్కెట్‌లో నష్టం రావడంతో మనస్తాపానికి గురై ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్‌పూర్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లా గోళ్లపాడుకు చెందిన గుడ్ల లక్ష్మీనారాయణ(37) అమీన్‌పూర్‌ పట్టణం పీజేఆర్‌ కాలనీలో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా ఇంటి నుంచి పనిచేస్తున్నాడు. తండ్రికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఊళ్లోని ఆస్తులను అమ్మి ఆసుపత్రిలో చూపించారు. రూ.20 లక్షలు మిగలడంతో వాటిని షేర్‌ మార్కెట్‌లో పెట్టారు. మొత్తం నష్టపోవడంతో కుటుంబ సభ్యులు నిలదీశారు. మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు అమీన్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగాకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని