logo

పాదచారులకు స్నేహామార్గం

పాదచారులకు ఉపయోగపడేలా నగరంలోని రద్దీ కూడళ్లను వినూత్నంగా అభివృద్ధి చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. బెంగళూరు నగరపాలక సంస్థ అమలు చేస్తోన్న నమూనాను నగరంలో ప్రయోగించేందుకు సిద్ధమైంది. మొదట ఆరాంఘర్‌ చౌరస్తాను రూ.2.63కోట్లతో పాదచారులకు

Published : 14 Aug 2022 06:42 IST

ఆరాంఘర్‌ కూడలిని తీర్చుదిద్దుతారిలా

ఈనాడు, హైదరాబాద్‌: పాదచారులకు ఉపయోగపడేలా నగరంలోని రద్దీ కూడళ్లను వినూత్నంగా అభివృద్ధి చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. బెంగళూరు నగరపాలక సంస్థ అమలు చేస్తోన్న నమూనాను నగరంలో ప్రయోగించేందుకు సిద్ధమైంది. మొదట ఆరాంఘర్‌ చౌరస్తాను రూ.2.63కోట్లతో పాదచారులకు స్నేహపూర్వక కూడలిగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఆరాంఘర్‌ చౌరస్తాలో నిత్యం 20వేలకుపైగా పాదచారులు రోడ్డు దాటుతుంటారు. దీన్ని పాదచారులకు స్నేహపూర్వకంగా అభివృద్ధి చేయాలని బెంగళూరుకు చెందిన జనాగ్రహ అనే సంస్థ జీహెచ్‌ఎంసీకి సూచించింది. జనాగ్రహ సంస్థ పట్టణ అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పనలో వినూత్న పద్ధతులపై అన్వేషణ చేస్తుంటుందని అధికారులు చెబుతున్నారు. సదరు సంస్థతో సమాలోచనలు చేసి నగరవ్యాప్తంగా జోన్‌కు రెండు చొప్పున, ఆరు జోన్లలో 12 కూడళ్ల అత్యాధునికంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని సీనియర్‌ ఇంజినీరు ఒకరు ‘ఈనాడు’తో తెలిపారు. తొలుత కూడలిని విశాలంగా విస్తరించి, అన్ని రోడ్డు మార్గాల వైపున బస్టాపులు నిర్మిస్తారు. ప్రయాణికులు రోడ్డు దాటేందుకు ప్రత్యేక జీబ్రా క్రాసింగ్‌ లైన్లను వేస్తారు. అన్ని వైపుల రోడ్లను కలుపుతూ పాదచారులకు ప్రత్యేక లైన్లను నిర్మిస్తామని రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఈఈ నాగేందర్‌ గౌడ్‌ వివరించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని