logo

లోకనాయకుడు సర్దార్‌ సర్వాయి పాపన్న

దిల్లీ పాలకులను ఎదిరించి తెలంగాణను పరిపాలించిన బహుజన చక్రవర్తి సర్దార్‌ సర్వాయి పాపన్న లోకనాయకుడు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కొనియాడారు. రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో గురువారం సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు 

Published : 19 Aug 2022 02:46 IST

ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌, చిత్రంలో మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్‌,  

రవీంద్రభారతి:  దిల్లీ పాలకులను ఎదిరించి తెలంగాణను పరిపాలించిన బహుజన చక్రవర్తి సర్దార్‌ సర్వాయి పాపన్న లోకనాయకుడు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కొనియాడారు. రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో గురువారం సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు  రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ.. బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో.. అంతకన్నా ఎక్కువ సంఖ్యలో సంఘాలున్నాయని అవన్నీ ఒకటి కావాలని పిలుపునిచ్చారు.  రాష్ట్ర మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. గౌడలపై దాడులు లేకుండా ‘నీరా’ అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ‘పొట్టి తాటిచెట్లు’ పరిశోధనలు పూర్తి అయ్యాయని, త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు.  మంత్రి తలసాని మాట్లాడుతూ.. బడుగు బలహీనవర్గాల చరిత్రను గత ప్రభుత్వాలు చేరిపేశాయని, కేసీఆర్‌ ప్రభుత్వం సర్దార్‌ పాపన్నను  పరిచయం చేసిందన్నారు.  రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డా.కృష్ణమోహన్‌రావు, సభ్యులు కిషోర్‌గౌడ్‌, ఉపేందర్‌, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని