logo

చిత్ర వార్తలు

రంగుల చిలుకా.. కెమెరాపై కులుకా?: సికింద్రాబాద్‌ ప్రాంతంలో కెమెరాపై సందడి చేస్తున్న చిలుక

Published : 19 Aug 2022 02:55 IST

నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

రంగుల చిలుకా.. కెమెరాపై కులుకా?: సికింద్రాబాద్‌ ప్రాంతంలో కెమెరాపై సందడి చేస్తున్న చిలుక


ఐటీ.. వెలుగుల్లోనూ మేటి: గచ్చిబౌలి వద్ద  ఓ ఐటీ కార్యాలయంలో వెలుగులు


ముద్దుగున్నాయ్‌.. రంగులద్దుకున్నాయ్‌: సికింద్రాబాద్‌ మారేడ్‌పల్లిలో కనిపించిన కోడిపిల్లలు


నే నచ్చానా.. ఫొటోలో వచ్చానా?: ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ముందు గార్డెన్స్‌లో ఫొటోకు పోజిస్తున్న శునకం


ముద్దబంతిలా ఉంది!: ఐమాక్స్‌ గేమ్‌ జోన్లో రంగురంగుల బంతుల మధ్య చిన్నారి సంబరం


చార్‌ సౌ సాల్‌..    చెదరని షాన్‌

చార్మినార్‌ అందం నాలుగు వందల ఏళ్లయినా చెక్కు చెదరలేదు. అప్పట్లో నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతం కాలక్రమంలో కాంక్రీట్‌ జంగిల్‌గా మారింది. నాంపల్లిలో ఓ ఎత్తయిన భవనం పైనుంచి  ఇలా కనువిందు చేస్తోంది


సిమెంట్‌..తారు.. వాహనదారుల బేజారు

షేక్‌పేట దర్గా నుంచి మహాప్రస్థానం మీదుగా ఫిలింనగర్‌ రోడ్డునంబరు 78 రహదారిపై తారు, సిమెంట్‌ కుప్పలుగా పడి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. తారు వల్ల కొందరు జారిపడుతుండగా.. కంకర సిమెంట్‌తో దుమ్ము లేచి ముందున్నది కనబడడం లేదని పలువురు వాపోతున్నారు.


అసలు ‘రంగు’ బయటపడింది..

అధికారుల నిర్లక్ష్యానికి ఉదాహరణ ఈ చిత్రం.. బాలానగర్‌-జీడిమెట్ల రహదారిపై కొత్తగా సైకిల్‌ ట్రాక్‌ నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా ఓవైపు వర్షాలు పడుతుండగానే.. మరోవైపు ట్రాక్‌పై రంగు వేయడంతో.. అది కొట్టుకుపోయి ఇలా వెలిసిపోయింది.


హే గాంధీ..

ఇంత ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఈ పిల్లలంతా విద్యార్థులే. వజ్రోత్సవాల సందర్భంగా వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులకు గాంధీ సినిమా చూపించడానికి ఇలా ట్రాలీ ఆటోలో కుక్కి తీసుకెళ్తున్నారు. ముషీరాబాద్‌ రోడ్డులో కనిపించిందీ దృశ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు