logo

‘రాజ్యాంగాన్ని చదివితే.. వేదాలను చదివినట్లే’

రాజ్యాంగాన్ని చదివితే వేదాలను చదివినట్లేనని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య తెలిపారు. పిల్లలకు రాజ్యాంగంపై అవగాహన కలగాలంటే ఐదోతరగతి నుంచే దీన్ని పిల్లలకు బోధించాలన్నారు. తాండూరులో ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌

Published : 25 Sep 2022 03:24 IST

ఆసుపత్రిలో మహిళతో మాట్లాడుతున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌  జస్టిస్‌ చంద్రయ్య

తాండూరు, న్యూస్‌టుడే: రాజ్యాంగాన్ని చదివితే వేదాలను చదివినట్లేనని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య తెలిపారు. పిల్లలకు రాజ్యాంగంపై అవగాహన కలగాలంటే ఐదోతరగతి నుంచే దీన్ని పిల్లలకు బోధించాలన్నారు. తాండూరులో ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌ శనివారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు హాజరు కావడానికి ముందు ఆయన స్థానిక రైల్వే అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. గతంలో పిల్లలకు విజ్ఞానంతో పాటు వినయ విధేయతలు, తల్లిదండ్రులంటే గౌరవం ఉండేదని ప్రస్తుతం ఆస్తులు ఎక్కువగా ఉన్న చోట తల్లిదండ్రులకు సమస్యలు ఉత్పన్నమౌతున్నాయని చెప్పారు. ఈ కేసులే ఎక్కువగా ఉంటున్నాయన్నారు.

జిల్లా ఆసుపత్రిలో రోగులతో...

జిల్లా ఆసుపత్రిని సందర్శించిన చంద్రయ్య వార్డుల్లో చికిత్స పొందుతున్న మహిళలతో మాట్లాడారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవిశంకర్‌, వైద్య సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. పలు విషయాలు తెలుసుకున్నారు.ఆసుపత్రి నిర్వహణ తీరు బాగుందని వైద్యులను అభినందించారు.  

మానవ హక్కులపై అవగాహన పెంపొందించు కోవాలి

ప్రజలు మానవ హక్కులపై అవగాహన పెంపొందించు కోవాలని జస్టిస్‌ చంద్రయ్య తెలిపారు. దేశంలో మానవులు తమ హక్కులను కాపాడుకునే వ్యవస్థ ఉందని చెప్పారు. కార్యక్రమంలో తాండూరు ఆర్డీఓ అశోక్‌కుమార్‌, డీఎస్పీ శేఖర్‌గౌడ్‌, గ్రామీణ సీఐ రాంబాబు, తాండూరు తహసీల్దారు చిన్నప్పల నాయుడు, మానవ హక్కుల సంఘం ప్రతినిధులు ఆనందరావు, అరవింద్‌, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని