logo

తపాలా ఉద్యోగి మృతికి కారణమైన ముగ్గురి అరెస్టు

అర్ధరాత్రి అనంతరం వీధుల్లో ఉన్న యువకుల్ని ఏం చేస్తున్నారని ప్రశ్నించినందుకు.. దాడి చేసి ఆ వ్యక్తి మృతికి కారణమైన ముగ్గురిని సైఫాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 29 Sep 2022 03:02 IST

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: అర్ధరాత్రి అనంతరం వీధుల్లో ఉన్న యువకుల్ని ఏం చేస్తున్నారని ప్రశ్నించినందుకు.. దాడి చేసి ఆ వ్యక్తి మృతికి కారణమైన ముగ్గురిని సైఫాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఈనెల 25 అర్ధరాత్రి 2 గంటల సమయంలో వీధుల్లో ఉన్న యువకులను స్థానికుడైన పోస్టల్‌ ఉద్యోగి విద్యాసాగర్‌.. రోడ్లపై ఏం చేస్తున్నారు, మీరెవరని ప్రశ్నించాడు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు అతన్ని దూషించడంతోపాటు చేతులతో కొట్టడంతో కిందపడిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దాడికి పాల్పడిన సుల్తాన్‌బజార్‌, కంద స్వామిలేన్‌లో ఉండే గడ్డం సాయినిఖిత్‌(24), మీర్‌పేట్‌లోని ద్వారకామయి కాలనీ వాసి గడ్డం రోహిత్‌(22)తో పాటు మరో బాలుణ్ని(17) అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని