logo

ఆధార్‌.. పనిచేయని సర్వర్‌!

వనస్థలిపురానికి చెందిన శ్రీనివాస్‌ తన కుమార్తెకు ఆధార్‌ నంబరు తీసుకునేందుకు సమీపంలోని ఓ బ్యాంకులో ఏర్పాటుచేసిన కేంద్రానికి వెళ్లాడు. సర్వర్‌ పనిచేయడం లేదనడంతో తిరిగి వచ్చాడు. మరో రోజు వెళ్లాడు. అప్పుడూ అదే సమాధానం. వారం తిరిగినా అదే తీరు.

Published : 01 Oct 2022 03:11 IST

ఈనాడు, హైదరాబాద్‌

వనస్థలిపురానికి చెందిన శ్రీనివాస్‌ తన కుమార్తెకు ఆధార్‌ నంబరు తీసుకునేందుకు సమీపంలోని ఓ బ్యాంకులో ఏర్పాటుచేసిన కేంద్రానికి వెళ్లాడు. సర్వర్‌ పనిచేయడం లేదనడంతో తిరిగి వచ్చాడు. మరో రోజు వెళ్లాడు. అప్పుడూ అదే సమాధానం. వారం తిరిగినా అదే తీరు.

ఆధార్‌ తీసుకునేందుకు ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం బ్యాంకు అకౌంట్‌ తెరవాలన్నా, పిల్లలను పాఠశాలలో చేర్పించాలన్నా, వాహనం రిజిస్ట్రేషన్‌ చేయాలన్నా.. ప్రతి అధికారిక పనికి ఆధార్‌ తప్పకుండా అడుగుతున్నారు. ఇది తప్పనిసరి కాకున్నా.. ప్రతిచోటా ఆధార్‌ లేకుండా పనులు జరగడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆధార్‌లో ఏ చిన్న తప్పు ఉన్నా సవరణ చేయడంతో పాటు కొత్తగా నమోదుకు వస్తున్నారు. చిరునామా, ఫోన్‌ నంబరు మార్చుకునేందుకు కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. కొన్ని రోజులుగా సర్వర్‌ పనిచేయడం లేదన్న సమాధానమే ఎదురవుతోంది. ఈ సమస్యను పరిష్కరించే విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు.

బాల ఆధార్‌ కేంద్రాల ఎత్తివేత!

ప్రస్తుతం బ్యాంకులు, తపాలా శాఖ కార్యాలయాలు, వివిధ ఏజెన్సీల వద్ద ఆధార్‌ నమోదు కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిల్లో ఐదేళ్లలోపు చిన్నారుల ఆధార్‌ నమోదుకు అవకాశం ఉంది. ప్రత్యేకంగా బాల ఆధార్‌ కార్డులు కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తోంది. త్వరలో బాల ఆధార్‌ కేంద్రాలు అన్ని ప్రాంతాల నుంచి ఎత్తివేసేందుకు అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఏదైనా ఒక ప్రాంతంలో కేంద్రం ఏర్పాటుచేసి బాల ఆధార్‌ నమోదు చేపట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని