logo

కాలంతో మారితేనే నవతరం పురోగతి

సమాజంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా నవతరం ముందుకు సాగుతూ.. ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి పేర్కొన్నారు.

Published : 01 Dec 2022 02:37 IST

నిజాం కళాశాల స్నాతకోత్సవంలో విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తున్న

ఆర్‌.లింబాద్రి, డి.రవీందర్‌, భీమా తదితరులు

రవీంద్రభారతి:  సమాజంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా నవతరం ముందుకు సాగుతూ.. ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి పేర్కొన్నారు. బుధవారం రవీంద్రభారతిలో నిజాం కళాశాల ద్వితీయ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఓయూ ఉపకులపతి ఆచార్య డి.రవీందర్‌ అధ్యక్షతన జరిగిన సభలో లింబాద్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.యువత డ్రగ్స్‌ వాడకం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఆచార్య డి.రవీందర్‌ అధ్యక్షోపన్యాసం చేస్తూ.. విద్య, పరిశోధన ప్రమాణాలను పెంచడానికి కృషి జరుగుతోందన్నారు. ఈ క్రమంలో ఓయూకు జాతీయ స్థాయిలో 22వ స్థానం దక్కిందన్నారు. ప్రిన్సిపల్‌ డా.భీమా ప్రగతి నివేదికను సమర్పించారు. అనంతరం బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏతో పాటు ఇతర యూజీ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన 26 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్‌ ప్రొ.శ్రీనగేష్‌, నిజాం కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ సి.వి.రంజని, కళాశాల పరీక్షల విభాగం కంట్రోలర్‌ డా.ఎస్‌.రేణుక, వైస్‌ ప్రిన్సిపల్‌(హాస్టల్స్‌) ప్రొ.బాలబ్రహ్మచారి, అధ్యాపకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని