logo

నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు నేడు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు సికింద్రాబాద్‌ ప్లాజా నుంచి సోమాజిగూడ జంక్షన్‌ మీదుగా ఖైరతాబాద్‌ వీవీ విగ్రహం కూడలి వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర అదనపు(ట్రాఫిక్‌) పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 26 Jan 2023 05:39 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు సికింద్రాబాద్‌ ప్లాజా నుంచి సోమాజిగూడ జంక్షన్‌ మీదుగా ఖైరతాబాద్‌ వీవీ విగ్రహం కూడలి వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర అదనపు(ట్రాఫిక్‌) పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్‌ ప్లాజా, సీటీవో, రసూల్‌పుర, ప్రకాశ్‌నగర్‌, బేగంపేట్‌, గ్రీన్‌లాండ్‌, సోమాజిగూడ జంక్షన్‌, రాజ్‌భవన్‌ మెట్రో స్టేషన్‌, ఖైరతాబాద్‌ వి.వి.విగ్రహం కూడలి, తెలుగు తల్లి జంక్షన్‌, రవీంద్రభారతి, ఆబిడ్స్‌ జీపీవో, ఎంజే మార్కెట్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ ఉంటుందన్నారు. రాజ్‌భవన్‌ క్వార్టర్స్‌ రోడ్‌(మెట్రో రెసిడెన్సీ) ఇరువైపుల నుంచి సాధారణ ట్రాఫిక్‌కు అనుమతి ఉండదని తెలిపారు. ఆయా ట్రాఫిక్‌ రద్దీ జంక్షన్ల వైపు వెళ్లకుండా, ప్రత్యామ్నయ మార్గాలను చూసుకోవాలని, ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని