logo

నష్టపరిహారం చెలించలేదని కుటుంబం ఆత్మహత్యాయత్నం

తమ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నష్టపరిహారం ఇవ్వకపోవడంతో  ఓ కుటుంబం ఆత్మహత్యకు ప్రయత్నించింది.

Updated : 30 Jan 2023 19:52 IST

పంజాగుట్ట: తమ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నష్టపరిహారం ఇవ్వకపోవడంతో  ఓ కుటుంబం ఆత్మహత్యకు ప్రయత్నించింది. వివరాల్లోకి వెళితే..  బాపుర్‌నగర్‌గల్ ప్రాంతానికి చెందిన ఎం. ఐలేష్‌ కుటుంబానికి ఇబ్రహీంపట్నంలో 5 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నష్టపరిహారం ఇవ్వలేదని బాధితులు వాపోయారు. ఈ క్రమంలో సోమవారం గ్రీన్‌ల్యాండ్స్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ఐలేష్‌ తన భార్య అనురాధ, కుమార్తె అక్షర, కుమారులు మణితేజ, వేణుతేజతో కలిసి కిరోసిన్‌ పోసుకొని నిప్పంటికోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని