logo

Hyderabad: మిసెస్‌ యూనివర్స్‌కి ప్రయత్నిస్తున్నా: కిరణ్మయి

మహిళలు వివాహంతోనే ఆగకుండా జీవితాన్ని విజయాల సాధనకు సోపానాలుగా మలుచుకోవచ్చని మిసెస్‌ ఇండియా (2022-23) మొదటి రన్నరప్‌ కిరణ్మయి అలివేలు అన్నారు.

Updated : 08 Feb 2023 07:51 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: మహిళలు వివాహంతోనే ఆగకుండా జీవితాన్ని విజయాల సాధనకు సోపానాలుగా మలుచుకోవచ్చని మిసెస్‌ ఇండియా (2022-23) మొదటి రన్నరప్‌ కిరణ్మయి అలివేలు అన్నారు. మంగళవారం సాయంత్రం హైదర్‌గూడలోని గోల్డ్స్‌ జిమ్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 2019 సంవత్సరంలో మిసెస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచానని, ప్రస్తుతం మిసెస్‌ యూనివర్స్‌ కోసం సాధన చేస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు అమ్మాయిగా ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు.  పోటీల్లో బాహ్య సౌందర్యం కన్నా.. అంతర్గత సౌందర్యమే ప్రధానమన్నారు. కార్యక్రమంలో మమత త్రివేది, డిజైనర్‌ వీణా పూజారి ఇతరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని