logo

ఫౌండేషన్‌ నుంచి నిరంతర సహకారం: డీసీసీబీ ఛైర్మన్‌

బీఎంఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా పరిగి నియోజక వర్గ పేద విద్యార్థుల కోసం నిరంతర సహాయ, సహకారాలు అందిస్తామని బీఎంఆర్‌ ఫౌండేషన్‌ అధినేత, డీసీసీబీ ఛైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు.

Published : 12 Feb 2023 00:56 IST

మాట్లాడుతున్న బుయ్యని మనోహర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు

పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: బీఎంఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా పరిగి నియోజక వర్గ పేద విద్యార్థుల కోసం నిరంతర సహాయ, సహకారాలు అందిస్తామని బీఎంఆర్‌ ఫౌండేషన్‌ అధినేత, డీసీసీబీ ఛైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ పదో తరగతి విద్యార్థులకు ఈ ఫౌండేషన్‌ ద్వారా స్టడీ మెటీరియల్‌ పంపిణీ కార్యక్రమం జయప్రదమైన సందర్భంగా శనివారం మండల పరిధిలోని గడిసింగాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 4 వేలకు పైగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందజేశామన్నారు. ఈసేవలు నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. ప్రజలు ఏది కోరుకుంటే అది చేసేందుకు సిద్ధమని, పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఏ పదవికైనా పోటీ చేస్తామని తెలిపారు. మాజీ విపణి ఛైర్మన్లు ఎస్పీ.బాబయ్య, కమతం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో దోమ ఎంపీపీ రాఘవేందర్‌, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, నాయకులు యాదయ్య, రాంచంద్రయ్య, పాలాది శ్రీనివాస్‌, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని