logo

కక్కుర్తి పడొద్దు.. భోజనాలు బాగుండాలి

ఎన్నికల నిర్వహణలోని అధికారులు, సిబ్బందికి నాసిరకం భోజనం సరఫరా అవుతోంది. అన్నం, కూరలు సరిగా ఉండట్లేదంటూ కొన్ని రోజులుగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Published : 10 May 2024 03:46 IST

ఆహారం, ఉద్యోగుల జీతాల్లో ఏఆర్‌ఓల చేతివాటం
అలా చేయొద్దంటూ డీఈవో రోనాల్డ్‌రాస్‌ హెచ్చరిక

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల నిర్వహణలోని అధికారులు, సిబ్బందికి నాసిరకం భోజనం సరఫరా అవుతోంది. అన్నం, కూరలు సరిగా ఉండట్లేదంటూ కొన్ని రోజులుగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పేరు చెప్పి కొందరు రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు నిధులు కాజేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఎన్నికల పరిశీలకులూ భోజనాలపై, పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

పనులు సొంతంగా లేదా బినామీ పేర్లతో.. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి దాదాపు రూ.కోటి అందాయి. సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు ఆ డబ్బును  సహాయ రిటర్నింగ్‌ అధికారుల(ఏఆర్‌ఓ) ఖాతాల్లో వేశారు. కొందరు ఏఆర్‌ఓలు ఆ నిధులపై కన్నేశారు. దాదాపు 80 శాతం ఏఆర్‌ఓలు భోజనం, స్టేషనరీ పనులు సొంతంగా లేదా బినామీల పేర్లతో చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఎన్నికల విధులు నిర్వహించే 45వేల మంది అధికారులు, సిబ్బంది బాధితులవుతున్నారు. రుచి, శుచి లేని వంటలను ఆరగించలేక అవస్థలు పడుతున్నారు.

హెచ్చరించిన రోనాల్డ్‌రాస్‌.. బాధ్యతగా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు, కార్మికులకు మంచి భోజనం అందించాలని తాజాగా జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్‌రాస్‌ యంత్రాంగాన్ని హెచ్చరించారు. రిటర్నింగ్‌ అధికారులు సైతం.. ఏర్పాట్ల విషయంలో లోపాలు కనిపించొద్దని ఏఆర్‌ఓలకు స్పష్టం చేశారు. మే 12, 13 తేదీల్లో డీఆర్‌సీ కేంద్రాల వద్ద  భోజనాల్లోనూ తేడా ఉండొద్దని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని