logo

మహిళల అభ్యున్నతికి మోదీ ప్రాధాన్యం

మహిళల స్వయంసమృద్ధి, ఆత్మగౌరవానికి ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యమిస్తున్నారని భాజపా మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, తమిళనాడు దక్షిణ కోయంబత్తూరు ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్‌ అన్నారు.

Published : 10 May 2024 03:22 IST

జ్యోతి వెలిగిస్తున్న సంగీతారెడ్డి, పక్కన వనతి, శిల్పారెడ్డి తదితరులు

రాయదుర్గం, న్యూస్‌టుడే: మహిళల స్వయంసమృద్ధి, ఆత్మగౌరవానికి ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యమిస్తున్నారని భాజపా మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, తమిళనాడు దక్షిణ కోయంబత్తూరు ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్‌ అన్నారు. గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్‌లో గురువారం ‘నారీ శక్తి’ పేరుతో చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం మహిళలతో సమావేశాన్ని నిర్వహించారు. గతంలో మహిళలకన్నా పురుషుల సంఖ్య అధికంగా ఉండేదని, నేడు 1000 మంది పురుషులుంటే, 1020 మంది మహిళలున్నారన్నారు. ముద్రా వంటి పథకాలతో రుణాలు పొంది వ్యాపారాలతో స్వావలంబన సాధిస్తున్నారని, భద్రతకూ మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో వనితల నిష్పత్తి పెరిగిందన్నారు. చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. విశ్వేశ్వర్‌రెడ్డి సతీమణి సంగీతారెడ్డి, రాష్ట్ర భాజపా ఇన్‌ఛార్జ్‌ నళిని, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా.శిల్పారెడ్డి, కార్యదర్శి విజయ, ఫౌండేషన్‌ ఆఫ్‌ ఫ్యూరిస్టిక్‌ సిటీస్‌ అధ్యక్షురాలు కరుణాగోపాల్‌, రాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి విజయలక్ష్మి, కార్పొరేటర్‌ రాధాధీరజ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని