logo

మోదీతోనే దేశానికి ప్రత్యేక గుర్తింపు: కొండా

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పనితీరుతోనే ప్రపంచంలోనే దేశానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

Published : 10 May 2024 03:37 IST

మాట్లాడుతున్న విశ్వేశ్వర్‌రెడ్డి

పరిగి, న్యూస్‌టుడే: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పనితీరుతోనే ప్రపంచంలోనే దేశానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. పరిగిలో గురువారం జరిగిన చేవెళ్ల పార్లమెంట్‌  నియోజక వర్గ స్థాయి గిరిజన సమ్మేళనం, రాత్రి సమయంలో జరిగిన రోడ్‌షో లో పాల్గొని మాట్లాడారు. దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని ఇందుకోసం కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి నాలుగు లక్షల ఓట్లు తనవెంట ఉన్నాయని చెప్పుకుంటూ కొన్నివర్గాల వారిని తక్కువ చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాదరావు, మిట్ట పరమేశ్వర్‌రెడ్డి, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప, షాద్‌నగర్‌ అభ్యర్థి విష్ణువర్దన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి పెంటయ్యగుప్త, రాంచందర్‌ పాల్గొన్నారు.

పరిగిలో రోడో షోకు హాజరైన అభిమానులు, కార్యకర్తలు

పెద్దేముల్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ నాయకులు చెప్పే మాయమాటలకు ప్రజలు మరోసారి మోసపోవద్దని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని అడికిచర్ల గ్రామంలో గురువారం కార్నర్‌ సమావేశాన్ని నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు హరీష్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్‌, రామచంద్రి, మాజీ మండల అధ్యక్షుడు సందీప్‌ కుమార్‌, వీరు, శివాజీ, కృష్ణ పాల్గొన్నారు.  

దేశ సంక్షేమం భాజపాతోనే సాధ్యం

మర్పల్లి: దేశ సంక్షేమం భాజపాతోనే సాధ్యం అని ఎంపీ అభ్యర్థి తనయుడు విశ్వజిత్‌రెడ్డి, నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ వడ్ల నందు అన్నారు. గురువారం మండల కేంద్రంలో భాజపా నాయకులు, కార్యకర్తలతో రోడ్‌ షో కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని