logo

పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా రాజధానిలో ఎన్నికల ప్రచారం..ఎక్కువ మంది గుమిగూడడంపై ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు గురువారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు.

Published : 10 May 2024 03:24 IST

11వ తేదీ సాయంత్రం నుంచి హైదరాబాద్‌, రాచకొండలో ఆంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా రాజధానిలో ఎన్నికల ప్రచారం..ఎక్కువ మంది గుమిగూడడంపై ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు గురువారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. 11న సాయంత్రం 6 నుంచి 14న ఉదయం 6 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. పోలింగ్‌ రోజైన 13న ఉదయం 6 నుంచి రాత్రి వరకు పోలింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు.

  • 11న సాయంత్రం నుంచి 13న సాయంత్రం వరకు అన్నిరకాల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులో ఉంటుంది.
  • మద్యం, కల్లు దుకాణాలు, బార్లు, మద్యం విక్రయించే అన్ని సంస్థలూ మూసివేయాలి.
  • 13వ తేదీన పోలింగ్‌ కేంద్రానికి ఓటర్లు రెండు క్యూలైన్లలో ఉండాలి.పురుషులు, మహిళలకు వేర్వేరుగా మాత్రమే ఉంటాయి. రెండు కంటే ఎక్కువ లైన్లలో ఉండడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు