logo

ప్రధాని రాక.. ట్రాఫిక్‌ ఆంక్షలు నేడు

ఎల్బీ స్టేడియంలో శుక్రవారం భాజపా బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సా.4 గంటల నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.

Published : 10 May 2024 03:13 IST

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, నారాయణగూడ: ఎల్బీ స్టేడియంలో శుక్రవారం భాజపా బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సా.4 గంటల నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.

బేగంపేట్‌ నుంచి ఎల్బీ స్టేడియం వరకు.. ప్రధాని బేగంపేట్‌ విమానాశ్రయం నుంచి షాపర్‌స్టాప్‌, హెచ్‌పీఎస్‌, బేగంపేట్‌ ఫ్లైఓవర్‌, గ్రీన్‌ల్యాండ్‌ వద్ద ఎడుమ వైపు రాజీవ్‌గాంధీ విగ్రహం, యశోద ఆసుపత్రి, రాజ్‌భవన్‌,  ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగు తల్లి జంక్షన్‌ వద్ద రైట్‌ టర్న్‌ తీసుకొని,  రవీంద్రభారతి కూడలి, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌, ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ మీదుగా ఎల్బీ స్టేడియానికి వెళ్తారు. సభ ముగిసిన అనంతరం తిరిగి ఈ మార్గంలోనే ప్రయాణం అవుతారు.

ఎల్బీ స్టేడియం పరిసరాల్లో.. ఏఆర్‌ పెట్రోల్‌ పంపు జంక్షన్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బాబు జగ్జీవన్‌రాం విగ్రహం వైపు అనుమతించరు. నాంపల్లి వైపు పంపిస్తారు.

బషీర్‌బాగ్‌ నుంచి బీజేఆర్‌ విగ్రహం కూడలి.. ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వైపు అనుమతించరు. గన్‌ఫౌండ్రి ఎస్‌బీఐ, జీపీవో అబిడ్స్‌ సర్కిల్‌, నాంపల్లి స్టేషన్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు. సుజాత స్కూల్‌ లేన్‌ నుంచి ఖాన్‌ లతీఫ్‌ఖాన్‌ భవన్‌ వైపు నుంచి ట్రాఫిక్‌కు నో ఎంట్రీ. నాంపల్లి వైపు పంపిస్తారు. రవీంద్రభారతి నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు, ఎల్బీ స్టేడియం మెయిన్‌ గేట్‌ ముందు, ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద మళ్లింపులు ఉంటాయి.

  • సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అక్షాన్ష్‌ యాదవ్‌ గురువారం ఎల్బీ స్టేడియం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. మోదీ సభ దృష్ట్యా శుక్రవారం రాష్ట్ర సచివాలయానికి 20 కిలోమీటర్ల పరిధిలో తేలికపాటి ఎయిర్‌క్రాఫ్ట్‌లు, డ్రోన్లు, పారా గ్లైడర్లు ఎగరడాన్ని నిషేధిస్తూ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని