logo

అజయ్‌ బంగా.. మన హెచ్‌పీఎస్‌ విద్యార్థే

ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా నామినేట్‌ అయిన అజయ్‌బంగా మన హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థే.

Published : 25 Feb 2023 02:55 IST

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, బేగంపేట: ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా నామినేట్‌ అయిన అజయ్‌బంగా మన హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థే. మాస్టర్‌ కార్డ్‌ సీఈవోగా విధులు నిర్వహించిన ఆయన హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ 1976 బ్యాచ్‌ విద్యార్థి. ఆయన ప్రపంచబ్యాంక్‌ అధ్యక్ష పదవికి నామినేట్‌ కావడం ఎంతో గర్వకారణంగా ఉందని పూర్వ విద్యార్థులు అన్నారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ శతవసంతాల వేడుకలు జరుపుకొంటున్న వేళ ఈ సమాచారం మరింత ఉత్సాహాన్ని కలిగించిందని హెచ్‌పీఎస్‌ సొసైటీ అధ్యక్షుడు గుస్తీ జె.నోరియా తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక శతాబ్ది ఉత్సవాలకు అజయ్‌బంగా రావాలని ఆకాంక్షించారు. ప్రజాసేవ, రాజకీయ, క్రీడలు, కార్పొరేట్‌, పారిశ్రామిక రంగాల్లో హెచ్‌పీఎస్‌ విద్యార్థులు అగ్రగణ్యులుగా ఉన్నారు. మూడేళ్ల క్రితం హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూలో విశ్వవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభావంతులైన పది మంది సీఈవోల్లో ముగ్గురు హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థులు సత్య నాదెళ్ల(మైక్రోసాఫ్ట్‌), శంతను నారాయణ్‌(అడోబ్‌) అజయ్‌ బంగా(మాస్టర్‌ కార్డ్‌) కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని