logo

టాస్కుల పేరుతో.. రూ.28.5 లక్షలు హాంఫట్‌

టాస్కులు పూర్తి చేస్తే లాభాలని రూ.28.5 లక్షలు దోచేశారంటూ ఓ బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.

Published : 24 Mar 2023 02:40 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: టాస్కులు పూర్తి చేస్తే లాభాలని రూ.28.5 లక్షలు దోచేశారంటూ ఓ బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం..షేక్‌పేట్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి టెలిగ్రామ్‌ ఖాతాకు ఓ సందేశం వచ్చింది. అందులోని లింక్‌పై క్లిక్‌ చేయడంతో అవతలి ‘వ్యక్తి మీరు కొంత డబ్బు పెడితే దానికి తాము కొన్ని టాస్కులు ఇస్తామని, రోజూ మూడు రౌండ్ల అవకాశం ఉంటుంద’ని చెప్పాడు. బాధితుడు ముందు కొంత డబ్బు పెడితే లాభాలు ఇచ్చారు. దాంతో విడతల వారిగా మొత్తం రూ.28.5 లక్షలు పోగొట్టుకున్నాడు.  డీసీపీ స్నేహా మెహ్రా ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని రూ.15 లక్షలు స్వాహా

మలక్‌పేటకు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌ ఖాతాకు పార్ట్‌టైమ్‌ జాబ్‌ అంటూ సందేశం వచ్చింది. బాధితుడు సంప్రదించగా అవతలి వ్యక్తి ఓ లింక్‌ పంపించి ముందుగా అందులో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నాడు. బాధితుడు ఆ వ్యక్తి చెప్పినట్లు చేస్తూపోయారు. మొదట రూ.వేయి కడితే రూ.1300 ఇచ్చారు. దాంతో విడతలవారీగా రూ.15 లక్షలు పోగొట్టుకున్నాడు. సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని