logo

సేవలు గుర్తించండి.. భద్రత కల్పించండి

సమగ్ర శిక్షా ఉద్యోగులు ఏళ్లుగా జిల్లా విద్యా శాఖలో కీలక పాత్ర వహిస్తున్నా ప్రభుత్వ పే స్కేలు వంటి సౌకర్యాలకు నోచుకోలేక పోతున్నారు.

Published : 26 Mar 2023 00:44 IST

పే స్కేలుకు సమగ్ర శిక్షా సిబ్బంది విన్నపాలు

క్షేత్ర స్థాయిలో విధుల నిర్వహణ

న్యూస్‌టుడే, వికారాబాద్‌ టౌన్‌ : సమగ్ర శిక్షా ఉద్యోగులు ఏళ్లుగా జిల్లా విద్యా శాఖలో కీలక పాత్ర వహిస్తున్నా ప్రభుత్వ పే స్కేలు వంటి సౌకర్యాలకు నోచుకోలేక పోతున్నారు. తాజాగా సెర్ప్‌ ఉద్యోగులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో తమ సేవలను గుర్తించి వారి మాదిరిగానే పే స్కేలు వర్తింప చేయాలని కోరుతున్నారు. గతంలో కూడా ఈ విషయమై పలుమార్లు విన్నపాలు చేసినా లాభం లేకపోయిందని పలువురు తెలిపారు.

వివిధ విభాగాల్లో 650 మంది

ప్రధానంగా జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో సిస్టమ్‌ అనలిస్టు, టెక్నికల్‌ పర్సన్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందిగా, ఎంఈఓ కార్యాలయంలో ఎంఐఎస్‌, కో ఆర్డినేటర్లుగా, కంప్యూటర్‌ ఆపరేటర్లు, మెసెంజర్లు, ఐఈఆర్‌పీలు, సీఆర్‌పీలు, పీటీఐలుగా తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా 12 నుంచి 15 ఏళ్లుగా ఒప్పంద పద్ధతిలోనే సేవలు అందిస్తున్నారు.

* తమ సేవలను గుర్తించి క్రమబద్ధీకరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తు బాగుంటుందని సిబ్బంది పేర్కొంటున్నారు. అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉండటంతో ఉద్యోగ భద్రత కల్పించాలని సంఘం ప్రతినిధులు పలుమార్లు అధికారులను కలిసి విన్నవించారు. ఇటీవలే డీఈఓకు కూడా వినతిపత్రం అందించి తమ ఇబ్బందులను వివరించారు.


వెంటనే క్రమబద్ధీకరించాలి
- గంగ్యానాయక్‌, సంఘం జిల్లా అధ్యక్షుడు

విద్యా శాఖలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న సమగ్రశిక్షా ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి. ఏళ్లుగా సేవలందిస్తున్నా ఎలాంటి ప్రభుత్వ సదుపాయాలకు, కనీస వేతనాలకు నోచుకోక ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా అవస్థలు పడుతున్నాయి. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని