logo

మహిళాభివృద్ధి, స్వావలంబనకు ప్రాధాన్యం

మహిళల స్వావలంబనకు స్త్రీ నిధి క్రెడిట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

Published : 01 Apr 2023 02:50 IST

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

రాయదుర్గం, న్యూస్‌టుడే: మహిళల స్వావలంబనకు స్త్రీ నిధి క్రెడిట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మాదాపూర్‌ శిల్పకళావేదికలో స్త్రీ నిధి క్రెడిట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది.  కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళలు ఇలాంటి పథకాలను  సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సంస్థ ఎండీ జి.విద్యాసాగర్‌రెడ్డి మాట్లాడుతూ.. 2011లో రూ.30 కోట్ల రుణాలతో ఆరంభించి, 2021-22 ఏడాదికి గాను స్వయం సహాయక సంఘాలకు రూ.మూడు వేల కోట్లు అందించామని తెలిపారు. రూఫ్‌ టాప్‌ సోలార్‌ యూనిట్‌, విద్యుత్తు వాహనాలను, పందిరి విధానంలో కూరగాయల సాగు, పెరట్లో కోళ్ల పెంపకం వంటి సరికొత్త పథకాలను ప్రవేశపెట్టి మహిళలు ఉపాధి పొందేలా చూస్తున్నామన్నారు. ఈ సందర్భంగా 2021 ఫలితాలు, సాధించిన విజయాలను కమిటీ సభ్యులు వివరించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన డీఆర్‌డీవో (జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు), మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు, ఉత్తమ మండల సమాఖ్య, పట్టణ స్థాయి ఫెడరేషన్లకు పురస్కారాలు ప్రదానం చేశారు. రాష్ట్ర పంచాయతి రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, మెప్మా ఎండీ సత్యనారాయణ, స్త్రీనిధి ఎండీ జి.విద్యాసాగర్‌రెడ్డి, మహిళాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ సీఎస్‌ రెడ్డి,  స్త్రీనిధి మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షురాలు జి.ఇందిరా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని