Hyderabad: సికింద్రాబాద్‌లో సినీ ఫక్కీ దోపిడీ.. నలుగురి అరెస్టు
సికింద్రాబాద్ పాట్ మార్కెట్ బంగారు దుకాణంలో జరిగిన దోపిడీ ఘటనలో నలుగురు అరెస్టయ్యారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ పాట్ మార్కెట్ బంగారు దుకాణంలో జరిగిన దోపిడీ ఘటనలో నలుగురు అరెస్టయ్యారు. ఐటీ అధికారుల ముసుగులో చోరీకి పాల్పడిన నిందితులు జాకీర్, రహీమ్, ప్రవీణ్, అక్షయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన అనంతరం నిందితులంతా మహారాష్ట్రకు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడకు వెళ్లి వారిని పట్టుకున్నారు. మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు తెలిపారు. దోపిడీకి పాల్పడిన ముఠాలో మొత్తం 8 మంది ఉన్నట్లు సమాచారం.
గత శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో పాట్ మార్కెట్‌లోని బాలాజీ గోల్డ్ షాప్‌లో ఐదుగురు అగంతుకులు ఐటీ అధికారులమంటూ చొరబడి 1700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పారిపోయిన ఘటన సంచలనం రేకెత్తిన విషయం తెలిసిందే. ఇంటిదొంగల సహకారంతోనే బంగారం దోచుకెళ్లి ఉండొచ్చనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దుకాణ యజమానులు, సిబ్బంది ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నట్టు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Avanigadda: మెగా డీఎస్సీ ఎక్కడ జగనన్నా?: వారాహి యాత్రలో నిరుద్యోగుల ఆవేదన
-
ODI WC 2023: భారత స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థులు జాగ్రత్త: పాక్ మాజీ కెప్టెన్
-
UGC NET 2023: యూజీసీ నెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల
-
Elections: అభ్యర్థుల నేర చరిత్రను.. పత్రికా ప్రకటనల్లో వెల్లడించాలి : ఎన్నికల సంఘం
-
World Culture Festival: ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం 180 దేశాల ప్రజల ప్రార్థన
-
GST collections: సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు.. 10% వృద్ధి