ఓఆర్‌ఆర్ లీజుపై.. చకచకా ముందుకు
అవుటర్ రింగ్ రోడ్డు లీజుకు సంబంధించి ఒప్పందంపై ముందుకు వెళ్లేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి.
ఈనాడు, హైదరాబాద్: అవుటర్ రింగ్ రోడ్డు లీజుకు సంబంధించి ఒప్పందంపై ముందుకు వెళ్లేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. గ్లోబల్ టెండర్లలో ఐఆర్‌బీ హెచ్1 బిడ్డర్‌గా నిలవడంతో ఏప్రిల్ 27న లెటర్ ఆఫ్ అవార్డు(ఎల్‌వోఏ)ను హెచ్‌ఎండీఏ జారీ చేసింది. ఇందులో భాగంగానే లీజులో కీలకమైన ఫైనాన్షియల్ క్లోజర్ కోసం ఇరు సంస్థలు తాజాగా సంతకాలు చేశాయి. దీని ప్రకారం ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా ఆధ్వర్యంలో ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీవీ)ని ఏర్పాటుచేస్తూ ఒప్పందం కుదిరింది. బిడ్‌లో పేర్కొన్న విధంగా రూ.7380 కోట్లు ఈ ఎస్‌పీవీ ద్వారా హెచ్‌ఎండీఏకు బదిలీ అయిన తర్వాత రహదారి అప్పగింతకు ఒక తేదీ(అపాయింట్‌మెంట్ డేట్) నిర్ణయిస్తారు. ఇందుకు 120 రోజుల గడువు ఇవ్వనున్నారు. టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్(టీవీటీ) ఖరారైన నేపథ్యంలో దాని బదులు ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే పేరుతో ఎస్‌పీవీ రంగంలోకి దిగనుంది.
ఆ బాధ్యత హెచ్‌ఎండీఏదే..
టోల్ వసూలు, నిర్వహణ వరకు ఐఆర్‌బీ పరిధిలోకి మారనుండగా.. పచ్చదనం నిర్వహణ, మౌలిక వసతుల కల్పన మాత్రం ఒప్పందం ప్రకారం హెచ్‌ఎండీఏ చేపట్టనుంది. ఇక్కడ పచ్చదనం నిర్వహణను డ్రిప్ విధానంలో చేపడుతున్నారు. అవుటర్‌ను లీజుకిచ్చినా పచ్చదనం నిర్వహణ హెచ్‌ఎండీఏకే ఉండటంతో ఏటా రూ.4కోట్ల వరకు భారం తప్పదంటున్నారు. ఇది కూడా ప్రైవేటు సంస్థకే అప్పగించి, పర్యవేక్షణ చేపడితే ఆ భారం తప్పేదంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
KTR: దిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ అలా మాట్లాడారా?: కేటీఆర్
-
Rajinikanth: ‘తలైవా 170’ గురించి ఆసక్తికర విషయం పంచుకున్న రజనీకాంత్..
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్